Fake News, Telugu
 

పాత వీడియోని చూపిస్తూ, పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కేరళ లో తాజాగా ధర్నా చేస్తున్న BJP నేతలంటూ షేర్ చేస్తున్నారు

0

కేంద్రంలోని BJP ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెంచడానికి వ్యతిరేకంగా కేరళలోని రాష్ట్ర BJP నాయకులు ధర్నా చేస్తున్నారు అని చెప్తూ కొందరు BJP జెండాలు పట్టుకున్న కార్యకర్తలు స్కూటర్లను తోసుకుంటూ నిరసన తెలుపుతున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇలా డ్రామాలు చేస్తున్నారని పోస్టులో ఆరోపిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్రం పెంచిన పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేకంగా కేరళ లో ఇప్పుడు ధర్నా చేస్తున్న BJP నేతలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుండి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. 2017 మరియు 2018లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు, ఇంతకు ముందు UPA ప్రభుత్వ హాయాంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు BJP నాయకులు నిరసన తెలిపినప్పటి కొన్ని పాత ఫోటోలతో పాటు ఈ వీడియోలోని స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయని తెలుపుతూ కొన్ని మలయాళీ ఆన్లైన్ వార్తా కథనాలు రాసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ చేయగా ఈ స్క్రీన్ షాట్స్ ని పోలిన ఫోటోలు ప్రచురించిన కొన్ని పాత ఆన్లైన్ వార్తా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి.  ఇలాంటిదే ఒక కథనం ప్రకారం 2016 లో BJP హయాంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు, అంతకు ముందు UPA ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు BJP నాయకులు నిరసన తెలిపినప్పటి కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయన్నది ఈ కథనం యొక్క సారాంశం. 

2018లో మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఒక మలయాళీ ఆన్లైన్ కథనం కూడా సోషల్ మీడియాలో UPA ప్రభుత్వ హాయాంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు BJP నాయకులు నిరసన తెలిపినప్పటి కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయని  తెలుపుతూ పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్ ఫోటో ప్రచురించింది. 2017 మరియు 2018లో కూడా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  షేర్ అయ్యాయి. ఐతే ఈ వీడియోలో BJP నాయకులు ఏ నేపథ్యంలో నిరసన తెలుపుతున్నారో మాకు కచ్చితంగా తెలియనప్పటికీ, ఇంటర్నెట్ లో ఈ ఫోటో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి పోస్టులోని వీడియో పాతదని, ఇటీవల కాలంలో కేరళలో జరిగిన నిరసనలది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

చివరగా, చాలా పాత వీడియోని చూపిస్తూ, ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేకంగా కేరళ లో ధర్నా చేస్తున్న BJP నేతలంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll