Fake News, Telugu
 

పశువు మాంసం తింటే మనుషులు చనిపోయేలా రసాయనాన్ని ధృవ్ పటేల్ అనే వ్యక్తి తయారు చేసినట్టు ఎక్కడా సమాచారం లేదు

0

అహ్మదాబాద్ ఎల్.డీ.యూనివర్సిటీకి చెందిన ధృవ్ పటేల్ తాజాగా ఒక రసాయనాన్ని తయారు చేసాడని, ఆ రసాయన ఇంజక్షన్ ఇస్తే పశువులకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదు అని, కానీ పశువు మరణించాక లేదా చంపి దాని మాంసాన్ని తింటే మాత్రం, తిన్న వ్యక్తులు నాలుగు గంటల్లో మరణిస్తారు అని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశువు మాంసం తింటే మనుషులు చనిపోయేలా తాజాగా ఒక రసాయనాన్ని తయారు చేసిన అహ్మదాబాద్ ఎల్.డీ.యూనివర్సిటీకి చెందిన ధృవ్ పటేల్.

ఫాక్ట్: పోస్ట్ లో చెప్పిన రసాయనం గురించి ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. ఇదే మెసేజ్ 2014 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. అంతేకాదు, తమ కాలేజీ కి చెందిన ఒక వ్యక్తి అలాంటి  రసాయనాన్ని తయారు చేసినట్టు తమ దగ్గర సమాచారం లేదని ఎల్.డీ.కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ వారు FACTLY కి తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన రసాయన ఇంజక్షన్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అలాంటి రసాయనాన్ని ధృవ్ పటేల్ అనే వ్యక్తి తయారు చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. అటువంటి రసాయనాన్ని నిజంగా ఎవరైనా తయారు చేస్తే, ప్రముఖ వార్తాసంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, ఆ రసాయనం గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. అంతేకాదు, ఇదే మెసేజ్ 2014 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. 2014 లో షేర్ చేసిన మెసేజ్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

పోస్ట్ లోని విషయం గురించి అహ్మదాబాద్ ఎల్.డీ.కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ వారికి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, అలాంటి పేరుతో తమ కాలేజీలో ఎవరూ లేరని తెలిపారు. అంతేకాదు, తమ కాలేజీ కి చెందిన ఒక వ్యక్తి అలాంటి  రసాయనాన్ని తయారు చేసినట్టు తమ దగ్గర సమాచారం లేదని చెప్పారు.

చివరగా, పశువు మాంసం తింటే మనుషులు చనిపోయేలా రసాయనాన్ని ధృవ్ పటేల్ అనే వ్యక్తి తయారు చేసినట్టు ఎక్కడా సమాచారం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll