Fake News, Telugu
 

‘ఢిల్లీ చలో’ రైతుల నిరసన ర్యాలీ కోసం మార్పులు చేయబడిన ట్రాక్టర్లను చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో AI ద్వారా రూపొందించబడింది.

0

13 ఫిబ్రవరి 2024న ఢిల్లీలో తలపెట్టిన ‘ఢిల్లీ చలో’ రైతుల నిరసన ర్యాలీ సందర్భంగా పోలీసులు పెట్టే బారికేడ్లను తొలగించడానికి, టియర్ గ్యాస్ షెల్స్‌ను నిరోధించడానికి రైతులు తమ ట్రాక్టర్లకు ఎలా మార్పులు చేసారో చూడండి అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 13 ఫిబ్రవరి 2024న ఢిల్లీలో తలపెట్టిన రైతుల నిరసన ర్యాలీ కోసం మార్పులు చేయబడిన ట్రాక్టర్లను చూపిస్తున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): 13 ఫిబ్రవరి 2024న ఢిల్లీలో తలపెట్టిన రైతుల నిరసన ర్యాలీ సందర్భంగా రైతులు మార్పులు చేసిన ట్రాక్టర్లను ఉపయోగించే అవకాశం ఉందని పలు రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం పోలీసులు ఏర్పాటు చేసే బారికేడ్‌లను తొలగించడానికి ట్రాక్టర్‌లకు హైడ్రాలిక్ సాధనాలు అమర్చబడ్డాయిని, టియర్ గ్యాస్ షెల్‌లతో పోరాడేందుకు ఫైర్ రెసిస్టెంట్ హార్డ్-షెల్ ట్రైలర్‌లు రైతులు సిద్ధం చేసారని, వారు ఈ మార్పు చేసిన వాహనాలతో కసరత్తులు కూడా చేశారు, అని తెలుపుతూ నిఘా వర్గాలు పోలీసులను అలెర్ట్ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలకి చెందిన అధికారి ఒకరు తెలిపారు అంటూ ANI సంస్థ రిపోర్ట్ చేసింది. అలాగే OpIndia  తమ వార్త కథనంలో ఉపయోగించిన ఈ ఫోటో AI ద్వారా రూపొందించిన ప్రతీతాత్మక చిత్రం మాత్రమే , నిజమైన ఫోటో కాదు అని తెలిపారు. అంతేకాకుండా మేము HIVE  అనే AI డిటెక్టర్ టూల్ ని ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో ఎక్కువగా (99.4%) AI ద్వారా రూపొందించబడింది అయ్యే అవకాశం ఉందని చూపించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) కల్పించే చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, ఇంతకు ముందు జరిగిన రైతు నిరసనలో నమోదు చేసిన పోలీసు కేసుల ఉపసంహరణ, లఖింపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 13 ఫిబ్రవరి 2024న ‘ఢిల్లీ చలో’ రైతు నిరసన ర్యాలీకి పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తున్న మీడియా కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

రైతు నిరసన ర్యాలీని అడ్డుకోవడానికి మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పలు రిపోర్ట్స్ ఉన్నాయి. (ఇక్కడ & ఇక్కడ)

ఈ నేపథ్యంలోనే ర్యాలీ సందర్భంగా పోలీసులు పెట్టే బారికేడ్లను తొలగించడానికి, టియర్ గ్యాస్ షెల్స్‌ను నిరోధించడానికి రైతులు తమ ట్రాక్టర్లకు మార్పులు చేశారు అని చెప్తూ ఈ ఫోటో వైరల్ అవుతోంది. వైరల్ పోస్టులో చెప్పినట్లు రైతులు ఈ నిరసన ర్యాలీ కోసం తమ ట్రాక్టర్లకు మార్పులు చేశారా అని వెతికితే, ఇదే విషయాన్ని తెలుపుతూ కేంద్ర నిఘా వర్గాలు పంజాబ్, హర్యానా, ఢిల్లీ పోలీసులను అలెర్ట్ చేసినట్లు మాకు పలు రిపోర్ట్స్ లభించాయి.(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, రైతుల నిరసన ర్యాలీకి పంజాబ్ మరియు హర్యానాలోని వివిధ జిల్లాల నుండి సుమారు 25,000 మందికి పైగా రైతులు మరియు 5000 ట్రాక్టర్లు 13 ఫిబ్రవరి 2024న  ఢిల్లీకి చేరుకుంటాయిని, పోలీసులు ఏర్పాటు చేసే బారికేడ్‌లను తొలగించడానికి ట్రాక్టర్‌లకు హైడ్రాలిక్ సాధనాలు అమర్చబడ్డాయిని, టియర్ గ్యాస్ షెల్‌లతో పోరాడేందుకు ఫైర్ రెసిస్టెంట్ హార్డ్-షెల్ ట్రైలర్‌లు రైతులు సిద్ధం చేసారని, వారు ఈ మార్పు చేసిన వాహనాలతో కసరత్తులు కూడా చేశారు” అని కేంద్ర నిఘా వర్గాలకు చెందిన అధికారి తెలిపారు అంటూ ANI సంస్థ రిపోర్ట్ చేసింది.

అలాగే ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోతో కూడిన OpIndia వార్త కథనం లభించింది. ఈ కథనంలో వారు ఉపయోగించిన ఈ ఫోటో AI ద్వారా రూపొందించిన ప్రతీతాత్మక చిత్రం మాత్రమే , నిజమైన ఫోటో కాదు అని తెలిపారు.

అంతేకాకుండా మేము ఈ ఫోటో AI ద్వారా రూపొందించిందా, కాదా అని నిర్ధారించడానికి, AI- రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి రూపొందించబడిన HIVE AI డిటెక్టర్ టూల్ ని ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో ఎక్కువగా (99.4%) AI ద్వారా రూపొందించబడింది అయ్యే అవకాశం ఉందని చూపించింది. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో AI ద్వారా రూపొందించబడింది అని నిర్థారించవచ్చు. కాకపోతే AI డిటెక్టర్ టూల్స్ ప్రతీసారి ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తాయని చెప్పలేము ఇదే విషయాన్ని తెలియచేస్తున్న ది న్యూయార్క్ టైమ్స్ కథనం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ‘ఢిల్లీ చలో’ రైతు నిరసన ర్యాలీ కోసం మార్పులు చేసిన ట్రాక్టర్లను చూపిస్తున్న  ఈ ఫోటో AI ద్వారా రూపొందించబడింది.

Share.

About Author

Comments are closed.

scroll