Fake News, Telugu
 

కానిస్టేబుల్ ని కొడుతున్న ఈ వీడియోలోని ఘటన రాజస్తాన్ లో జరిగింది; తెలంగాణలో కాదు

0

‘టీఆర్ఎస్ పార్టీ పాలనలో పోలీసుల పరిస్థితి ఇలా ఉంది’, అని చెప్తూ ఒక వ్యక్తిని కొంత మంది కొడుతున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ లో కొంత మంది ఒక పోలిస్ ని కొడుతున్న వీడియో.

ఫాక్ట్: ఆ వీడియో అసలు తెలంగాణ కి సంబంధించిన వీడియో కాదు. రాజస్తాన్ లోని అజ్మీర్ లో జరిగిన సంఘటన అది. తాగి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వీడియోలోని ఆర్ఏసీ జవాన్ ని కొట్టినట్టు తెలిసింది. అయితే, ఇరువర్గాలు ఈ ఘటన పై కేసులు పెట్టడంతో విచారణ జరుగుతుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో గురించి వెతకగా, వీడియోలోని ఘటన రాజస్తాన్ లోని అజ్మీర్ లో జరిగిందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. కావున, కొన్ని పదాలతో ఇంటర్నెట్ లో వెతకగా, ఆ ఘటన కి సంబంధించి వివిధ వార్తాసంస్థలు నవంబర్ 2020 లో ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. వాటిని  ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

తాగి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వీడియోలోని ఆర్ఏసీ జవాన్ ని కొట్టినట్టు ప్రజలు ఆరోపించారని, ఆ జవాన్ ని సస్పెండ్ చేయడం జరిగిందని ‘ఆల్ట్ న్యూస్’ వారితో అజ్మీర్ ఎస్పీ తెలిపారు. వీడియోలోని ఘటన అజ్మీర్ లోనే జరిగినట్టు FACTLY కి కూడా దర్గా పోలీస్ స్టేషన్ వారు తెలిపారు. అయితే, ఇరువర్గాలు ఈ ఘటన పై కేసులు పెట్టడంతో విచారణ జరుగుతుంది. ఈ ఘటన పై ఆర్ఏసీ జవాన్ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ ని ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, తాగి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణ పై వీడియోలో కానిస్టేబుల్ ని కొడుతున్న ఘటన రాజస్తాన్ లో చోటుచేసుకుంది; తెలంగాణ లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll