Fake News, Telugu
 

పాత వీడియోని చూపిస్తూ ఫ్రాన్స్ లో టీచర్ తల నరికిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

ఇటీవల ఫ్రాన్స్ లో మొహమ్మద్ ప్రవక్త కార్టూన్లు క్లాస్ రూమ్ లో ప్రదర్శించిన టీచర్ తల నరికి హత్య చేసిన వ్యక్తిని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేసారని చేప్తు, దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫ్రాన్స్ లో మొహమ్మద్ ప్రవక్త కార్టూన్లు క్లాస్ రూమ్ లో ప్రదర్శించిన టీచర్ తల నరికి హత్య చేసిన వ్యక్తిని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2019లో ఫ్రాన్స్ లో చేతిలో కత్తులతో గొడవ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటిది. ఈ వీడియో కి ఇటీవల ఫ్రాన్స్ లో టీచర్ తల నరికేసిన ఘటనకి ఎటువంటి సంబంధంలేదు. పైగా ఫ్రాన్స్ లో టీచర్ తల నరికిన వ్యక్తి ఆ రోజే పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రెన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని ప్రచురించిన ఒక 2019 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో ఫ్రాన్స్ లోని గ్రేనోబ్లె స్టేషన్ దగ్గర చేతిలో కత్తులతో గొడవ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో తీసింది.

పైగా ఫ్రాన్స్ లో టీచర్ తల నరికిన వ్యక్తి ఆ రోజే పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. దీన్నిబట్టి ఈ వీడియో ఫ్రాన్స్ లో పోలీసులు అరెస్ట్ చేస్తున్నది ఫ్రాన్స్ లో టీచర్ తల నరికిన వ్యక్తిని కాదని చెప్పొచ్చు.

ఇటీవల మొహమ్మద్ ప్రవక్త కార్టూన్లు క్లాస్ లో ప్రదర్శించిన కారణంగా శామ్యూల్ ప్యాటీ అనే టీచర్ తల ఒక 18 ఏళ్ల ముస్లిం యువకుడు నరికివేసిన ఘటన గురించి మాట్లాడుతూ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాంపై  చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫ్రాన్స్ తో సహా పలు దేశాలలో ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ వీడియో 2019లో ఫ్రాన్స్ లో చేతిలో కత్తులతో గొడవ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటిది.

Share.

About Author

Comments are closed.

scroll