Fake News, Telugu
 

అప్పడాలు, పచ్చళ్ళ పరిశ్రమలతో MoUలు గురించి గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది

0

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి అమర్నాథ్ అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUల గురించి వివరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా విస్తృతంగా షేర్ అవుతోంది.  ఈ పరిశ్రమలతో ప్రస్థుత YSRCP ప్రభుత్వం MoUలు కుదుర్చుకున్నట్టు అర్ధం వచ్చేలా, ‘ఏపీ యువత ఆలోచించుకోవాల్సిన సమయం ఇది’ అనే కాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నేపథ్యం ఏంటో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి అమర్నాథ్ అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUల గురించి వివరిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం):  ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUలు కుదుర్చుకుందని వివరించారు. ఐతే ఈ ప్రసంగంలో కేవలం MoUల గురించి ప్రస్తావించిన భాగాన్ని మాత్రమే డిజిటల్‌గా ఎడిట్ చేసి, ఈ MoUలు ప్రస్తుత YSRCP ప్రభుత్వం కుదుర్చుకుందని అర్ధం వచ్చేలా షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలోని దృశ్యాలు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం నుండి సేకరించింది. ఐతే అమర్నాథ్ తన ప్రసంగంలో అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUల గురించి ప్రస్తావించినప్పటికీ, ఈ MoUలు గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్నట్టు వివరించారు.

వైజాగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి వివరించే క్రమంలో తమ ప్రభుత్వం వివిధ రంగాలలోని పరిశ్రమలతో కుదుర్చుకున్న MoUలు గురించి, వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. ఆ తర్వాత గత టీడీపీ ప్రభుత్వం(2014-19) అప్పట్లో కుదుర్చుకున్న MoUలు గురించి వివరించే ప్రయత్నం చేసారు.

ఐతే ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUలు కుదుర్చుకుందని వివరించారు. అమర్నాథ్ ప్రసంగం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే గుడివాడ అమర్నాథ్ ప్రసంగంలో నుండి కేవలం అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైన MoUలు గురించి ప్రస్తావించిన భాగాన్ని మాత్రమే కట్ చేసి, ఈ MoUలు ప్రస్తుత ప్రభుత్వం కుదుర్చుకున్నట్టు అర్ధం వచ్చేలా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ వీడియోలో గుడివాడ అమర్నాథ్ గత టీడీపీ ప్రభుత్వం అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUలు కుదుర్చుకుందని అన్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll