Fake News, Telugu
 

చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి చిన్న పిల్లలకు ఉచిత చికిత్స అందిస్తోందంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు

0

తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలో అత్యాధునిక సదుపాయాలు మరియు 600 మంది డాక్టర్లు కలిగిన కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో అప్పుడే జన్మించిన శిశువుల నుండి 12 సంవత్సరాల వయసు లోపు చిన్న పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. రూ. 10 లక్షల వరకు ఖర్చయ్యే గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఈ ఆసుపత్రి చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తోందని ఈ పోస్టులో తెలిపారు. చెన్నై నగరంలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి ఈ ఆసుపత్రి గురించి ఎవ్వరిని అడిగినా ఆసుపత్రి చిరునామా చెబుతారని పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, ఈ ఆసుపత్రిలో చికిత్స కోసం సంప్రదించవలిసిన మొబైలు నెంబర్లని ఈ పోస్టులో షేర్ చేస్తూ, ఈ సమాచారాన్ని వీలైనంత మందికి ఫార్వార్డ్ చేయాలని కోరుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.    

క్లెయిమ్: తమిళనాడు రాష్ట్రం చెన్నైలో కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ చిన్నపిల్లలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో తమ ఆసుపత్రికి సంబంధించి జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి వారు స్పష్టం చేశారు. కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి ఎటువంటి లాభాలు ఆశించకుండా చిన్న పిల్లలకు తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడం కోసం పనిచేస్తుందని, తాము పూర్తిగా ఉచిత చికిత్స అందించడం లేదని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి యాజమాన్యం తమ వెబ్సైటులో స్పష్టం చేసింది. పోస్టులో తెలుపుతున్న ఎగ్మోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆసుపత్రి, ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ICH) అని తెలిసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల లాగానే ఈ ఆసుపత్రిలో కూడా రోగులకు ఉచిత వైద్యం అందిస్తారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో తెలుపుతున్న సమాచారనికి సంబంధించిన వివరాల కోసం ‘కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్’ వెబ్సైటులో వెతికితే, సోషల్ మీడియాలో తమ ఆసుపత్రికి సంబంధించి జరుగుతున్న ఈ ప్రచారం గురుంచి కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి వారు స్పష్టతనిచ్చినట్టు తెలిసింది. తమ ఆసుపత్రి చిన్న పిల్లలకు పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తావమని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి వారు తమ వెబ్సైటులో స్పష్టం చేశారు.

కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ ఎటువంటి లాభాలు ఆశించకుండా చిన్న పిల్లలకు తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడం కోసం పనిచేస్తుందని, తాము పూర్తిగా ఉచిత చికిత్స అందించడం లేదని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ తమ వెబ్సైటులో స్పష్టం చేసింది

సోషల్ మీడియాలో తెలుపుతున్న ఎగ్మోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆసుపత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ICH) అని, అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల లాగానే ఈ ఆసుపత్రిలో కూడా రోగులకు ఉచిత వైద్యం అందిస్తారని కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న మొబైలు నెంబర్లు కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో అపాయింట్మెంట్ కోసం సంప్రదించవలిసిన మొబైలు నెంబర్లని కామకోటి చైల్డ్ ట్రస్ట్ వారు తెలిపారు.

చివరగా, తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి చిన్న పిల్లలకు ఉచిత చికిత్స అందిస్తోందంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll