Fake News, Telugu
 

జనసేన ర్యాలీ సందర్భంగా భీమవరంలోని బంగారం షాపులు స్వచ్చందంగా మూసేస్తున్నట్టు షేర్ చేస్తున్న ఈ ‘ABN’ స్క్రీన్ షాట్ మార్ఫ్ చేయబడినది

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో భీమవరంలోని బంగారం షాపుల యజమానులు స్వచ్చందంగా తమ షాపులను మూసివేయాలని నిర్ణయించుకున్నట్టు ‘ABN’ వార్తా సంస్థ న్యూస్ బులెటిన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. గతంలో జనసేన కార్యకర్తలు బంగారు షాపులపై చేసిన దాడులను దృష్టిలో ఉంచుకొని భీమవరంలోని బంగారం షాపుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.    

క్లెయిమ్: జనసేన ర్యాలీ సందర్భంగా భీమవరంలోని అన్నీ బంగారం షాపుల యాజమాన్యాలు స్వచ్చందంగా తమ షాపులను మూసివేయాలని నిర్ణయించుకున్నారంటూ ‘ABN’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్న స్క్రీన్ షాట్.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ‘ABN’ వార్తా ఛానెల్ స్క్రీన్ షాట్ మార్ఫ్ చేసినది. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ స్క్రీన్ షాట్ ఫేక్ అని, తమ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ‘ABN’ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు జనసేన ర్యాలీ సందర్భంగా భీమవరంలోని బంగారం షాపుల యాజమాన్యాలు స్వచ్చందంగా తమ షాపులను మూసివేయాలని నిర్ణయించుకున్నట్టుగా ‘ABN’ వార్తా ఛానెల్ ఇటీవల ఏమైనా రిపోర్ట్ పబ్లిష్ చేసిందా అని వెతికితే, అటువంటి వార్తా ఏది ‘ABN’ న్యూస్ ఛానెల్ ఇటీవల రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ‘ABN’ వార్తా ఛానెల్ ప్రస్తుత బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ స్క్రీన్ షాట్‌ని పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోల్చి చూడగా, పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది అని స్పష్టంగా తెలుస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోకి సంబంధించి ABN’ వార్తా సంస్థ 27 జూన్ 2023 నాడు తమ ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ స్క్రీన్ షాట్ ఫేక్ అని, తమ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ‘ABN’ స్పష్టం చేసింది. గతంలో జనసేన కార్యకర్తలు భీమవరంలోని బంగారు షాపులపై దాడులకు పాల్పడినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

చివరగా, జనసేన ర్యాలీ సందర్భంగా భీమవరంలోని బంగారం షాపులు స్వచ్చందంగా మూసివేస్తున్నట్టు షేర్ చేస్తున్న ఈ ‘ABN’ వార్తా ఛానెల్ స్క్రీన్ షాట్ మార్ఫ్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll