ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, పాకిస్థాన్ లో హిందూ అమ్మాయిలను కుటుంబం ముందే కొంతమంది వ్యక్తులు లాక్కు పోతున్నారని అందులో దాని గురించి చెప్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వీడియో పాకిస్థాన్ లో హిందూ అమ్మాయిలను కొంతమంది వ్యక్తులు లాక్కుపోవడానికి సంబంధించినది.
ఫాక్ట్ (నిజం): వీడియో రాజస్థాన్ లో జరిగిన ఒక ఘటనకి సంబంధించినది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక ఫ్రేమ్ ‘DNA’ వార్తా సంస్థ యొక్క కథనంలో లభించింది. ఆ కథనం ద్వారా ఈ క్రింది విషయం తెలిసింది.
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ‘షోకత్’ అని వ్యక్తి ఒక మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నాడు. వివాహమనంతరం ఆ బాలిక తన తల్లి తో పాటు ఉంటోంది. షోకత్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు, ఆమె కి తగిన వయస్సు (మైనర్) లేకపోవడంతో వాళ్ళ అమ్మ నిలువరించింది. దాంతో ఇళ్ల్యాజ్ అనే వ్యక్తితో కలిసి షోకత్ తన అత్త పై దాడి చేసి, తాను పెళ్లి చేసుకున్న ఆ మైనర్ బాలికని ఎత్తుకెళ్లాడు.
చివరగా, రాజస్థాన్ లో జరిగిన ఒక ఘటనకి సంబంధించిన వీడియోని పెట్టి ‘పాకిస్థాన్ లో హిందూ అమ్మాయిలను లాక్కెళ్తున్నారు’ అని తప్పుగా ప్రచారం చేస్టున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
opps i don’t no know about this video i im sorry for share this.