Fake News, Telugu
 

‘చపాక్’ సినిమాలో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరుని హిందూ పేరుగా మార్చలేదు

2

నటి దీపిక పదుకొనే నటించిన ‘చపాక్’ సినిమాని యదార్థ సంఘటనల ఆధారంగా తీసారు. అయితే, నిజజీవితంలో లక్ష్మీ అగర్వాల్ మీద నదీమ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి ఆసిడ్ దాడి చేస్తే, సినిమాలో మాత్రం దాడి చేసిన వ్యక్తి పేరు ‘రాజేష్ శర్మ’ అని హిందూ పేరు పెట్టినట్టుగా చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘చపాక్’ సినిమాలో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరుని హిందూ పేరు (‘రాజేష్ శర్మ’) గా మార్చారు.

ఫాక్ట్ (నిజం): ‘చపాక్’ సినిమాలో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరుని హిందూ పేరుగా మార్చలేదు. సినిమాలో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరు ‘బషీర్’; ‘రాజేష్ శర్మ’ కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

నిజజీవితంలో లక్ష్మీ అగర్వాల్ పై ఆసిడ్ దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు శిక్ష పడినట్టు ఢిల్లీ హైకోర్టు తీర్పులో చూడవొచ్చు. నిందితుల్లో ఒకరి పేరు ‘నయీమ్ ఖాన్’ అలియాస్ ‘గుడ్డు’, మరొకరు ‘రాఖీ’ అనే మహిళ. నయీమ్ పేరుని ‘రాజేష్ శర్మ’ గా మార్చారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

సినిమాలో నయీమ్ పేరుని ‘రాజేష్ శర్మ’ గా మార్చినట్టు సోషల్ మీడియా లో పోస్టులు వైరల్ అవ్వడంతో, ఆ సినిమా స్క్రీనింగ్ చూసిన కొన్ని మీడియా సంస్థల వారు ఆ సినిమాలో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరుని హిందూ పేరుగా మార్చలేదని తెలిపారు. ఆ సినిమా లో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరు ‘బషీర్’ అని, మాలతీ (సినిమాలో లక్షీ పేరు) బాయ్ ఫ్రెండ్ పేరు ‘రాజేష్’ అని ఉన్నట్టు వివిధ మీడియా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ‘చాపాక్’ రివ్యూస్ లో కూడా సినిమాలో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరు ముస్లిం పెరుగానే ఉందని రాసినట్టు చూడవొచ్చు.

హిందూ పేరుగా మార్చినట్టు ఆర్టికల్ (ఆర్కైవ్డ్)  రాసిన ‘స్వరాజ్య’ వార్తాసంస్థ కూడా ఇప్పుడు ఆర్టికల్ టైటిల్ మార్చినట్టుగా చూడవొచ్చు.

చివరగా, ‘చపాక్’ సినిమాలో ఆసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరుని హిందూ పేరుగా మార్చలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

2 Comments

  1. అనంతరేడి on

    ఏ ఒక్క మీడియా అన్న నిజాయితీగా పని చేస్తున్న దా
    ముందు మీడియా వాళ్ళని చెప్పుతొ కొట్టలి సిగ్గు లేని మీడియా అమ్ముడు పొయే నాకొడుకులు

scroll