ఇటీవల అమెరికా చేపట్టిన డ్రోన్ దాడి లో ఇరాన్ యొక్క జనరల్, ఖాసిం సులేమని, చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా డ్రోన్ తో జనరల్ సులేమని పై దాడి చేసిన వీడియో అని చెప్తూ ఒక పోస్ట్ ఫేస్ బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ క్లెయిమ్ లో ఎంత వరకు నిజం ఉందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: అమెరికా డ్రోన్ ద్వారా ఇరాన్ యొక్క జనరల్, ఖాసిం సులేమని పై దాడి జరుపుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆ వీడియో లో ఉన్న ఫుటేజ్ ఒక వీడియో గేమ్ ది. అంతేకాక, ఆ వీడియోని యూట్యూబ్ లో 2015లోనే అప్లోడ్ చేసారు. కావున, ఆ పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
ఆ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని ‘Yandex’ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే, అదే వీడియోతో కూడుకున్న సెర్చ్ రిజల్ట్స్ చాలా వచ్చాయి. వాటి ద్వారా, ఆ వీడియోని యూట్యూబ్ లో 2015లోనే ‘Byte Conveyor Studios’ అనే ఆర్జెంటినాకి చెందిన ఒక వీడియో గేమ్ డెవలప్మెంట్ స్టూడియో అప్లోడ్ చేసిందని తెలిసింది. ఆ వీడియో కింద వారు ఇచ్చిన వివరణ మేరకు అది మొబైల్ ప్లాట్ఫార్మ్ కోసం వారు తయారు చేస్తున్న ఒక గేమ్ యొక్క ప్రివ్యూ అని తెలిసింది. కావున, అది ఒక వీడియో గేమ్ యొక్క పాత వీడియో.
అంతేకాక, ఇంతకముందు రష్యా కూడా అదే వీడియోని తప్పుగా ఉపయోగించి అమెరికా ISIS తో కలిసి పని చేస్తుందని క్లెయిమ్ చేసింది.
చివరగా, ఒక వీడియో గేమ్ క్లిప్ ని తీసుకొని ఇరాన్ యొక్క జనరల్, ఖాసిం సులేమని పై అమెరికా జరిపిన డ్రోన్ దాడులు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?