Fake News, Telugu
 

IIT ఢిల్లీ పెసరపప్పు నుండి గుడ్లకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసింది, కోడి గుడ్లు కాసే చెట్లను కాదు

0

చెట్టుకి కోడి గుడ్డు కాసినట్టు ఉండే ఒక వీడియోని షేర్ చేస్తూ IIT స్టూడెంట్స్ కోడి గుడ్లు కాసే చెట్లు పండించారని అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి సమాచారం కోరుతూ కొందరు ఈ వీడియోని మా వాట్సాప్ టిప్ లైన్ నెంబర్ (+91 9247052470)కి పంపించారు. ఐతే ఈ కథనం ఈ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: IIT స్టూడెంట్స్ ఆవిష్కరించిన కోడి గుడ్లు కాసే చెట్ల వీడియో.

ఫాక్ట్(నిజం): 2019లో IIT ఢిల్లీకి చెందిన కొంత మంది పెసరుపప్పు తో అచ్చం కోడి గుడ్ల రుచి ఉండేలా ప్రత్యామ్నాయ గుడ్లను తయారు చేసారు. ఐతే  IIT ఢిల్లీ కేవలం పెసరపప్పు నుండి గుడ్లను తయారు చేసిందే గానీ గుడ్లు కాసే చెట్లను కాదు. సాధారణంగా ప్లాంట్-బేస్డ్ గుడ్లు తాయారు చేయడమంటే చెట్లకు గుడ్లు కాయడం కాదు, ఈ గుడ్లను పూర్తిగా శాఖాహార ఉత్పత్తులతో ల్యాబ్ లో తాయారు చేయడం. ఎగ్ ప్లాంట్ కి కాసే తెల్ల వంకాయలను కోసేసి వాటి స్థానంలో కోడి గుడ్లు అతికించి ఈ వీడియో షూట్ చేసి ఉండొచ్చు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

సెప్టెంబర్ 2019లో IIT ఢిల్లీ తమ కాలేజీ ఇండస్ట్రీ డే రోజున ల్యాబ్ లో తాయారు చేసిన ప్లాంట్-బేస్డ్ గుడ్లను ప్రదర్శించింది. శాకాహారులకు హై ప్రోటీన్ గల ఆహారం అందించాలనే ఉద్దేశంతో అచ్చం కోడి గుడ్ల రుచి ఉండేలా ఈ ప్రత్యామ్నాయ గుడ్లను తయారు చేసారు. IIT ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్య దశోరా నాయకత్వంలోని టీం పెసరు పప్పు నుండి ఈ గుడ్లను తాయారు చేసారు. ఐతే ఈ గుడ్లు ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. 2019లో జరిగిన ఈ ఆవిష్కరణ నేపథ్యంలోనే పోస్టులోని వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యుండొచ్చు.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే IIT ఢిల్లీ గుడ్లు కాసే చెట్లను తయారు చేయలేదు. సాధారణంగా ప్లాంట్-బేస్డ్ గుడ్లు తయారు చేయడమంటే చెట్లకు గుడ్లు కాయేలా చెయ్యడం కాదు, ఈ గుడ్లను పూర్తిగా శాఖాహార ఉత్పత్తులతో ల్యాబ్ లో తాయారు చేయడం. IIT ఢిల్లీ వారు ఈ గుడ్లను పెసరపప్పు నుండి తయారు చేసారు.

ఇంతకు ముందు కూడా ఇలాగే ప్లాంట్-బేస్డ్ మాంసం తయారు చేసిన ఉదాహారణలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే పోస్టులోని వీడియోకి IIT ఢిల్లీ తయారు చేసిన ప్లాంట్-బేస్డ్ గుడ్లకు ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియోలో వినిపిస్తున్న మాటల భాష బట్టి ఈ వీడియోకి భారత్ కి సంబంధంలేదని తెలుస్తుంది. సాధారణంగా తెలుపు రంగులో ఉండే వంకాయలు పండే చెట్లను ఎగ్ ప్లాంట్ అని అంటారు. ఈ చెట్లకు కాసిన వంకాయలు అచ్చం చెట్లకు గుడ్లు కాసినట్టే కనిపిస్తాయి. ఈ చెట్లకు సంబంధించిన వీడియోలు కొన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే పోస్టులోని వీడియో ఇలాంటి ఒక చెట్టుకి కాసిన వంకాయను కోసి దాని స్థానంలో గుడ్లు అతికించి షూట్ చేసి ఉండొచ్చు. గతంలో ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయినప్పుడు ఈ వీడియోలో చూపించేది నిజం కాకపోయి ఉండొచ్చని చెప్పిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, IIT ఢిల్లీ పెసరపప్పు నుండి గుడ్లకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసింది, కోడి గుడ్లు కాసే చెట్లను కాదు.

Share.

About Author

Comments are closed.

scroll