ఇటీవల తెలంగాణలోని తుక్కుగూడలో బీజేపీ ఒక బహిరంగ సభ నిర్వహించింది. ఆ బహిరంగ సభ జరిగిన నేపథ్యంలో ఒక సభ వీడియోని పెట్టి, టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తే అలానే అంత జనం వస్తారా అని ప్రశ్నిస్తూ కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల తెలంగాణలోని తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ యొక్క వీడియో.
ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో బీజేపీకి కానీ, తెలంగాణాకి కానీ సంబంధించినది కాదు. అది ఇటీవల శివసేన పార్టీ మహారాష్ట్రలో నిర్వహించిన ఒక సభకు సంబంధించిన వీడియో. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే వీడియోని చాలా మంది సోషల్ మీడియాలో శివసేన సభకు సంబంధించిన వీడియోగా షేర్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. తాజాగా శివసేన పార్టీ మహారాష్ట్రలో నిర్వహించిన సభకు సంబంధించిన దృశ్యాలు చూడగా, అవి పోస్ట్‌లోని వీడియోతో పోలి ఉన్నట్టు తెలిసింది. ఆ సభకు సంబంధించిన మరిన్ని దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.
తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభకి సంబంధించిన అసలైన దృశ్యాలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పోస్ట్‌లోనిది ఇటీవల తెలంగాణాలోని తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించిన వీడియో కాదు.