Fake News, Telugu
 

కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ చేసిన ఈ ట్వీట్‌ని చేసింది రాజ్ థాకరే పేరుతో సృష్టించిన ఒక పేరడీ (ఫ్యాన్) పేజీ

0

‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే, కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ  అలాగే, కరీనా కపూర్‌ని విమర్శిస్తూ ఒక ట్వీట్ పెట్టారని సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజ్ థాకరే కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ అలాగే, కరీనా కపూర్‌ని విమర్శిస్తూ పెట్టిన ట్వీట్.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్న ట్వీట్‌ని రాజ్ థాకరే పేరుతో సృష్టించిన ఒక పేరడీ (ఫ్యాన్ పేజీ) ట్విట్టర్ హేండిల్ పెట్టింది. రాజ్ థాకరే అధికారిక ట్విట్టర్ హేండిల్‌కి ట్విట్టర్ వెరిఫైడ్ సింబల్ ఉంటుంది. కానీ, పోస్టులో  కనిపిస్తున్న ట్వీట్‌పై వెరిఫైడ్ సింబల్ లేదు. కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ లేదా, కరీనా కపూర్‌ని విమర్శిస్తూ రాజ్ థాకరే ఎటువంటి ట్వీట్ పెట్టలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌ని రాజ్ థాకరే 06 సెప్టెంబర్ 2020 నాడు పెట్టినట్టు చూపిస్తుంది. ఈ వివరాల ఆధారంగా ట్విట్టర్ అడ్వాన్స్ సెర్చ్ ఉపయోగించి ఈ ట్వీట్ కోసం రాజ్ థాకరే అధికారిక ట్విట్టర్ హేండిల్‌లో వెతికితే, రాజ్ థాకరే కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ లేదా, కరీనా కపూర్‌ని విమర్శిస్తూ 06 సెప్టెంబర్ 2020 నాడు ఎటువంటి ట్వీట్ పెట్టలేదని తెలిసింది.

పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌ని జాగ్రత్తగా గమనిస్తే, ఈ ట్వీట్టర్ హేండిల్ యూసర్ పేరు ‘@iRajThackeray’ అని ఉంది. కాని, రాజ్ థాకరే అధికారిక ట్విట్టర్ హేండిల్‌పై ఉన్న యూసర్ పేరు @RajThackeray. అంతేకాదు, రాజ్ థాకరే అధికారిక ట్విట్టర్ హేండిల్‌పై వెరిఫైడ్ సింబల్ ఉంటుంది. కాని, పోస్టులో  కనిపిస్తున్న ట్వీట్‌పై వెరిఫైడ్ సింబల్ లేదు. దీనిబట్టి, ట్వీట్‌ని రాజ్ థాకరే పేరుతో సృష్టించిన ఒక పేరడీ (ఫ్యాన్ పేజీ) ట్విట్టర్ హేండిల్ పెట్టిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

2020లో కంగనా రనౌత్‌కి, మహారాష్ట్ర ప్రభుత్వానికి గొడవ జరిగిన సందర్భంలో ఇదే ట్వీట్‌ని షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఇంగ్లీషులో ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ అలాగే, కరీనా కపూర్‌ని విమర్శిస్తూ చేసిన ఈ ట్వీట్‌ని చేసింది రాజ్ థాకరే పేరుతో సృష్టించిన ఒక పేరడీ (ఫ్యాన్) పేజీ.

Share.

About Author

Comments are closed.

scroll