Fake News, Telugu
 

ఈ వీడియోలో ముస్లింలు చేసిన ర్యాలీ బంగ్లాదేశ్ లో జరిగింది, త్రిపురలో కాదు

0

“త్రిపురలో మేలుకున్న ముస్లింలు” అని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక పెద్ద ర్యాలీ జరుగుతున్నట్టు చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: త్రిపురలో ర్యాలీ తీస్తున్న ముస్లింల వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో ర్యాలీ బంగ్లాదేశ్ లో జరిగింది, త్రిపురలో కాదు. ఖదియానీ కమ్యూనిటీ వారిని నాన్-ముస్లింలగా డిక్లేర్ చేయమని కోరుతూ అలిగంజ్ మదర్సా, తహఫుజ్ ఖత్మే నబుయత్ బంగ్లాదేశ్ కలిసి నారాయణ్‌గంజ్‌లో ఈ ర్యాలీ తీసారు. త్రిపురలో ముస్లింలు ఇటువంటి ర్యాలీ ఇటీవల చేసినట్టుగా ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. ఈ యూట్యూబ్‌ వీడియో 02 ఫిబ్రవరి 2020న అప్లోడ్ చేసారు. ఆ ర్యాలీ నారాయణ్‌గంజ్‌లో జరిగినట్టు యూట్యూబ్‌ వీడియో యొక్క బెంగాలీ టైటిల్ ద్వారా తెలుస్తుంది. నారాయణ్‌గంజ్‌ అనబడే సిటీ బంగ్లాదేశ్ లో ఉంది, త్రిపురలో కాదు.

వీడియో బంగ్లాదేశ్ కి సంబంధించి అయ్యుంటుందని క్లూ తీసుకొని, కీ వర్డ్స్ యూస్ చేసి గూగుల్లో వెతకగా, ఆ ర్యాలీకి సంబంధించి ఆర్టికల్ మరియు పోస్ట్స్ లభించాయి. ఖదియానీ కమ్యూనిటీ వారిని నాన్-ముస్లింలగా డిక్లేర్ చేయమని కోరుతూ అలిగంజ్ మదర్సా మరియు తహఫుజ్ ఖత్మే నబుయత్ బంగ్లాదేశ్ కలిసి నారాయణ్‌గంజ్‌లో 2020లో ఈ ర్యాలీ తీసారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని ఈ ర్యాలీ తీసారు. ఖదియానీలు ప్రోఫెట్ ని ఆఖరి ప్రోఫెట్ గా చూడరని, అందుకే వారిని నాన్-ముస్లింలగా డిక్లేర్ చేయమని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

వీడియోలోని పోస్టర్లను జాగ్రత్తగా గమనించినట్లైతే, అన్నీ కూడా బెంగాలీలో రాసినవని తెలుస్తుంది. ఒక పోస్టర్ చివరన, బెంగాలీలో అలిగంజ్ మదరస అని రాసి ఉంది. అయితే అలిగంజ్ మదరస బంగ్లాదేశ్ లోనే ఉన్నట్టు గూగుల్ మాప్స్ లో చూడొచ్చు.    

త్రిపురలో ముస్లింలు ఇటువంటి ర్యాలీ ఇటీవల చేసినట్టుగా ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు.

చివరగా, ఈ వీడియోలో ముస్లింలు చేసిన ర్యాలీ బంగ్లాదేశ్ లో జరిగింది, త్రిపురలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll