సోషల్ మీడియాలో ఒక ఫోటోతో ఉన్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ప్రకారం, అమెరికా ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోదీ వేషధారణలో డొనాల్డ్ ట్రంప్, యోగీ ఆదిత్యనాథ్ వేషధారణలో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనంలో వాస్తవం ఎంతో ఈ ఫాక్ట్ – చెక్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: ఈ ఫోటోలో అమెరికా ఎన్నికల ర్యాలీలో మోదీ వేషధారణలో డొనాల్డ్ ట్రంప్, యోగి ఆదిత్యనాథ్ వేషధారణలో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు కనిపిస్తున్నారు.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలు AI -ఫోటోషాప్ ద్వారా రూపొందించబడ్డాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల రోడ్‌షో ఫోటో ఆధారంగా ఇవి ఎడిట్ చేసి రూపొందించారు. గూగుల్ నుండి ఫోటోలను ఉపయోగించి sahixd అనే AI ఆర్టిస్ట్ వీటిని సృష్టించాడు. ఈ ఫోటోలు కేవలం వినోదం కోసం తీయబడ్డాయని, ఎవరినీ నొప్పించేందుకు ఉద్దేశించినవి కావని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వివరణలో స్పష్టం చేశాడు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు.
వైరల్ ఫోటోను గూగుల్ లెన్స్‌లో సెర్చ్ చేయగా, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల రోడ్‌షో రిపోర్ట్స్ (ఇక్కడ, మరియు ఇక్కడ) లభించాయి.
ఫోటోను జాగ్రత్తగా పరిశీలించగా, ప్రతి ఫోటోపై @sahixd అనే వాటర్‌మార్క్ ఉండటం గమనించాము. @sahixd కోసం గూగుల్ సెర్చ్ చేయగా, ఆయన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్కు దారి చేసింది, అక్కడ ఈ వైరల్ ఫోటోల్లో ఒకదానికి మేడ్ విత్ AI+ ఫోటోషాప్ అని, ఫోటోలు గూగుల్ నుండి తీసుకోబడ్డాయి అని ఉంది. అదే పోస్ట్ వివరణలో ఇవి సృజనాత్మక మరియు వినోద ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడ్డాయని, ఏ కులాన్ని, మతాన్ని, లేదా ఏ వ్యక్తిని బాధపెట్టే ఉద్దేశం లేదు అని ఉంది.
అతని ఇన్‌స్టాగ్రామ్ బయోలో ద్వారా తాను AI ఫోటోలు, వీడియోలు రూపొందించే ఆర్టిస్ట్ అని మాకు తెలిసింది.
చివరిగా, AI- ఫోటోషాప్ ద్వారా తయారు చేసిన ఫోటోలను అమెరికా ఎన్నికల సందర్భంగా మోదీ వేషధారణలో డొనాల్డ్ ట్రంప్, యోగీలా ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు షేర్ చేస్తున్నారు