Fake News, Telugu
 

కాంగ్రెస్ అభ్యర్థులలో 33 మంది తమతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ ‘దిశ’ వార్తా కథనం ఫేక్

0

కాంగ్రెస్ అభ్యర్థులలో 33 మంది తమతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని రిపోర్ట్ చేస్తూ ‘దిశ’ వార్తా పబ్లిష్ చేసిన కథనమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఈ 33 మంది అభ్యర్థులకి సీట్లు ఇప్పించి, ఆర్థిక సహాయం చేస్తున్నది తామే అని, గెలిచిన వెంటనే ఈ 33 మంది మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ వార్తా కథనం రిపోర్ట్ చేసింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.      

క్లెయిమ్: కాంగ్రెస్ అభ్యర్థులలో 33 మంది తమతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా ‘దిశ’ వార్తా కథనం.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని కథనాన్ని ‘దిశ’ వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదు. సోషల్ మీడియాలో తమ పేరుతో వైరల్ చేస్తున్న ఈ వార్తా కథనం ఫేక్ అని ‘దిశ’ వార్తా సంస్థ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం కూడా చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన కథనాన్ని ‘దిశ’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిందా? లేదా? అని తెలుసుకునేందుకు ‘దిశ’ వార్తా సంస్థ వెబ్సైటులో వెతికితే, కేటీఆర్‌కు సంబంధించి అటువంటి వార్తా కథనమేదీ ‘దిశ’ వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలోని 33 మంది అభ్యర్థులు తమతో టచ్‌లో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఏ ఒక్క వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు.

సోషల్ మీడియాలో తమ పేరుతో వైరల్ అవుతున్న ఈ వార్తా కథనానికి సంబంధించి ‘దిశ’ సంస్థ స్పష్టతనిచ్చింది. “ఈ వార్త దిశ డైనమిక్ లో రాలేదు. ఇది ఫేక్ వార్త దీనిని నమ్మకండి”, అని ‘దిశ’ వార్తా సంస్థ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది.

చివరగా, కాంగ్రెస్ అభ్యర్థులలో 33 మంది తమతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ దిశ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll