Fake News, Telugu
 

కింగ్ జార్జ్-Vను ఉద్దేశిస్తూ ‘జన గణ మన’ను తాను రాయలేదని, ‘అధినాయక’ అంటే కింగ్ జార్జ్-V కాదని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు

0

1911లో కింగ్ జార్జ్-V భారత పర్యటన సమయంలో తనను ఉద్దేశిస్తూ భారత జాతీయ గీతం ‘జన గణ మన’ను రవీంద్రనాథ్ ఠాగూర్ రాసాడని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1911లో కింగ్ జార్జ్-V భారత పర్యటన సమయంలో తనను ఉద్దేశిస్తూ భారత జాతీయ గీతం ‘జన గణ మన’ను రవీంద్రనాథ్ ఠాగూర్ రాసాడు.

ఫాక్ట్: 1911 కాంగ్రెస్ సెషన్‌లో ఒకే రోజు రెండు పాటలు పాడారని, అందులో ఒకటి ఠాగూర్ రచించిన ‘జన గణ మన’ కాగా, మరొకటి కింగ్ జార్జ్-V కోసం రామానుజ్ చౌదరి ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాట అని, అయితే కొన్ని ఇంగ్లీష్ మీడియా సంస్థలు మాత్రం ఠాగూర్ పాట కింగ్ జార్జ్-V కోసం పాడారని తప్పుగా రిపోర్ట్ చేసాయని తెలిసింది. కింగ్ జార్జ్-Vను ఉద్దేశిస్తూ ‘జన గణ మన’ను తాను రాయలేదని, ‘జన గణ మన’ గీతంలో ‘అధినాయక’ అంటే  కింగ్ జార్జ్-V కాదని 1937 మరియు 1939లలో తాను రాసిన లేఖల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ‘జన గణ మన’ గీతంలో ‘అధినాయక’ అంటే కింగ్ జార్జ్-V కాదని 2015లో ‘ది ఇండియన్ ఎక్సప్రెస్’ వారు ప్రచురించిన ఒక ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చింది. 1911 కాంగ్రెస్ సెషన్‌లో ఒకే రోజు రెండు పాటలు పాడారని, అందులో ఒకటి ఠాగూర్ రచించిన ‘జన గణ మన’ కాగా, మరొకటి కింగ్ జార్జ్-V కోసం రామానుజ చౌదరి ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాట అని, అయితే కొన్ని ఇంగ్లీష్ మీడియా సంస్థలు మాత్రం ఠాగూర్ పాట కింగ్ జార్జ్-V కోసం పాడారని తప్పుగా రిపోర్ట్ చేసినట్టు ఆ అర్టికల్‌లో చదవచ్చు. ఈ అంశంపై ఇతర వార్త సంస్థలు రాసిన ఆర్టికల్స్‌లో ఇదే విషయం చెప్పినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.

1911 కాంగ్రెస్ సెషన్‌లో మొదటి సారిగా ‘జన గణ మన’ గీతం పాడినట్టు తెలిసింది. 1911 కాంగ్రెస్ సెషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్‌లో రెండవ రోజు మీటింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘దేశభక్తి గీతంతో’ మొదలయిందని ఉన్నట్టు చూడవచ్చు. తరువాత కొద్దిసేపటికి రాజ కుటుంబీకుల స్వాగతం కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాట పడినట్టు ఆ డాక్యుమెంట్‌లో చదవచ్చు. అంతేకాదు, ‘The Historical Record of The Imperial Visit to India 1911’ అనే డాక్యుమెంట్‌లో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాజ కుటుంబీకుల స్వాగతం కోసం పాట తయారు చేసినట్టు ఎక్కడా లేదని తెలిసింది.

కింగ్ జార్జ్-Vను ఉద్దేశిస్తూ ‘జన గణ మన’ను తాను రాయలేదని, ‘జన గణ మన’ గీతంలో ‘అధినాయక’ అంటే  కింగ్ జార్జ్-V కాదని 1937 మరియు 1939లలో తాను రాసిన లేఖల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఇక్కడ చదవచ్చు. ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ పుస్తకాల్లో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) చూడవచ్చు.

చివరగా, కింగ్ జార్జ్-Vను ఉద్దేశిస్తూ ‘జన గణ మన’ను తాను రాయలేదని, ‘అధినాయక’ అంటే కింగ్ జార్జ్ V కాదని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు.

Share.

About Author

Comments are closed.

scroll