Fake News, Telugu
 

ఫోటోలోని సైనికుడు భారత జవాను కాదు

0

‘-30 ఎముకలు కొరికే చలిలో, దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న మన భారత జవానులకు హ్యాట్సాఫ్’ అంటూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: -30 డిగ్రీ చలిలో బాధ్యతలు నిర్వహిస్తున్న భారత జవాను ఫోటో. 

ఫాక్ట్ (నిజం): అది భారత జవాను ఫోటో కాదు. ఫోటోలో ఉన్నది అమెరికా సైనికుడు. -30 డిగ్రీ చలిలో భారత సైనికులు కూడా సియాచిన్ లో బాధ్యతలు నిర్వహిస్తారు, కానీ పోస్టులో అమెరికా సైనుకుడి ఫోటో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్టులోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ‘alamy’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. ఆ ఫోటో గురించి వివరిస్తూ, జపాన్ లో అమెరికా మరియు జపాన్ దళాలు కలిసి నిర్వహించిన ట్రైనింగ్ కి సంబంధించిన ఫోటో అని ఆ వెబ్ సైట్ లో ఉన్నట్టు చూడవొచ్చు. ఆ ఫోటోలో ఉన్నది అమెరికా సైనికుడు అని చెప్తూ ఉన్న ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు

-30 డిగ్రీ చలిలో భారత సైనికులు కూడా సియాచిన్ లో బాధ్యతలు నిర్వహిస్తారు. దాని గురుంచి వేరు వేరు వార్త సంస్థలు గతంలో రిపోర్ట్ చేసాయి.

చివరగా, పోస్టులో పెట్టిన ఫోటో భారత సైనికుడిది కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll