‘1800 సంవత్సరాల క్రితం మన భాగవతం’ అని చెప్తూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: 1800 సంవతరాల క్రితం రాసిన భాగవతం ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది భాగవతం కాదు. అది పాత కాలపు ఇస్లాం మత గ్రంథం. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ‘Getty Images’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. ‘Restoration of the oldest Koran in the world’ అని ఆ ఫోటోకి టైటిల్ ఉన్నట్టు వెబ్ సైట్ లో చూడవొచ్చు. కావున, ఫోటోలో ఉన్నది భాగవతం కాదు. దానికి సంబంధించిన మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, ఫోటోలో ఉన్నది ‘1800 సంవతరాల క్రితం రాసిన భాగవతం’ కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?