NRC, CAA బిల్ అమలు వల్ల అస్సాంలో పోలీసులు అక్కడి ప్రజలను వాళ్ళ ఇంటిలో నుంచి బలవంతంగా బయటకు పంపిస్తున్నారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ యొక్క క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: NRC, CAA బిల్ తరువాత అస్సాం లో ప్రజలని పోలీసులు వాళ్ళ ఇళ్లల్లో నుండి బలవంతంగా బయటకు పంపుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆ వీడియో జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ (JDA) ఒక కాలనీ లో అక్రమ కట్టడాలను కూలగొట్టడానికి జరిపిన ఒక డ్రైవ్ లో పోలీసులను ప్రజలు అడ్డుకుంటున్న సంఘటనకు సంబంధించింది. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
‘DD News‘ ఆర్టికల్ ద్వారా అస్సాం ఫైనల్ NRC లిస్ట్ లో మొత్తం 19 లక్షల మంది పౌరుల పేర్లు తీసెయ్యబడ్డాయని తెలిసింది.
ఆ వీడియోలో ఉన్న పోలీసు వారి ఉనిఫారం మీద లోగో అస్సాం పోలీసుది కాకుండా, రాజస్థాన్ పోలీసుది ఉంది.
ఆ వీడియో స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతకగా, అదే వీడియో, కానీ వేరే క్లెయిమ్ తో ఉన్న ఒక ట్వీట్ కనిపించింది. ఆ ట్వీట్ కింద కామెంట్స్ లో జైపూర్ పోలీసులు ఒక న్యూస్ పేపర్ లో ఈ వీడియో స్టిల్ తో వచ్చిన ఒక ఆర్టికల్ క్లిప్ ను పెట్టారు. దాని ప్రకారం, జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ (JDA) అక్రమ కట్టడాలను కూలగొట్టడానికి జరిపిన డ్రైవ్ లో ఒక కాలనీ లో కొన్ని భవనాలను ధ్వంసం చేసారు. అంతేకాదు, చట్ట విరుద్ధ ఆక్రమణలను ఆపడానికి పోలీసులు చేస్తున్న ఆ డ్రైవ్ ని అడ్డుకోవడానికి వారి ముందు స్త్రీలను ఉంచారని తెలిపారు. కావున, పోస్ట్ లోని వీడియో రాజస్థాన్ కి సంబంధించిన సంఘటన. పోస్టులో చెప్పినట్టు అస్సాం – NRC, CAA కి సంబంధించినది కాదు.
చివరగా, రాజస్థాన్ కి సంబంధించిన ఒక వీడియోను, NRC, CAA బిల్ వలన అస్సాం లో పోలీసులు ప్రజలను వాళ్ళ ఇంట్లో నుండి వెళ్లగొడుతున్నారని తప్పు ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?