Fake News, Telugu
 

నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ మధ్య జరిగిన సంభాషణగా చెప్తున్నది ఒక ఊహాత్మక సంభాషణ

0

నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఇద్దరు నడుస్తూ మాట్లాడుతున్నట్టు, పక్కన వల్లభాయ్ పటేల్ రిక్షాలో వెళ్తున్నట్టు ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి, వారి ముగ్గురి మధ్యలో జరిగిన సంభాషణ అని వివరిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ మధ్య జరిగిన సంభాషణ.

ఫాక్ట్(నిజం): నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ మధ్య పోస్టులో చేప్తున్న విధంగా జరిగిన సంభాషణకు సంబంధించి ఎటువంటి అధికారికమైన లేదా అనధికారికమైన రికార్డులు గాని, సమాచారం గాని లేదు. 1946లో కాంగ్రెస్ కాబినెట్ మిషన్ కి అంగీకారం తెలిపిన సందర్భాన్ని వివరిస్తూ ఈ ఫోటోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెబ్సైటులో షేర్ చేసారు. కావున పోస్టు ద్వారా చెప్తున్నది తప్పు

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెబ్సైటులో కాంగ్రెస్ చరిత్రను తెలిపే చ్రరిత్రాత్మక ఘటనల కాలక్రమంలో ఉంది. ఈ వెబ్సైటులో 1946లో కాంగ్రెస్ కాబినెట్ మిషన్ కి అంగీకారం తెలిపిన సందర్భాన్ని వివరిస్తూ ఈ ఫోటోని షేర్ చేసారు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు వీరి ముగ్గురి మధ్యలో జరిగిన సంభాషణ గురించి మాకు ఎక్కడా అధికారికమైన లేదా అనధికారికమైన రికార్డులు గాని, సమాచారం గాని దొరకలేదు. దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నది ఒక ఊహాత్మక సంభాషణ అని చెప్పొచ్చు.

ఐతే ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఒక ప్రముఖ పష్టున్ నేత. గాంధీ వల్ల ప్రభావితమై స్వయం ప్రతిపత్తిగల పష్టున్ ప్రాంతం కోసం అహింసా మార్గంలో పోరాడాడు. అహింసని ప్రచారం చేసాడు.  భారత దేశ విభజనని ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించాడు కాని విభజన అనంతరం ఖాన్ పాకిస్తాన్ లో స్తిరపడ్డాడు. ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ని ‘Frontier Gandhi’ అని పిలిచేవారు. 1987లో ఈయనకి భారత దేశంలోని అతున్యత పౌర పురస్కారమైన భారతరత్న ప్రధానం చేసారు. ఐతే భారతీయుడు కాకుండా భారత రత్న పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఖాన్. ఖాన్ 1946లో జరిగిన constitutional assembly లో మాట్లాడిన మాటలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పోస్టులో చెప్తున్న సంభాషణలకు సంబంధించి అధికారికమైన లేదా అనధికారికమైన రికార్డులు గాని, సమాచారం గాని లేవు.

Share.

About Author

Comments are closed.

scroll