Fake News, Telugu
 

కాశ్మీర్ పండిట్లను ఉద్దేశించి అరుంధతి రాయ్ పోస్టులోని వ్యాఖ్యలు చేయలేదు

1

కాశ్మీరీ హిందువులను అక్కడ నుంచి వెల్లగొట్టారు అనడం తప్పు. నిజానికి వాళ్లకు 3 అవకాశాలు ఇచ్చారు..  మతం మారడం, చావడం, లేదా పారిపోవడం. వాళ్ళు పారిపోవాలని ఇచ్ఛపూర్వకంగా నిర్ణయించుకున్నారు.. ఇది ఇస్లాం మీకిచ్చిన స్వేచ్ఛ.. మీ అభిప్రాయాలను గౌరవించడంగా చూడాలి’ అని రచయిత్రి  అరుంధతి రాయ్ అన్నారనీ, ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అరుంధతి రాయ్ – ‘కాశ్మీరీ హిందువులను అక్కడ నుంచి వెల్లగొట్టారు అనడం తప్పు. నిజానికి వాళ్లకు 3 అవకాశాలు ఇచ్చారు.. మతం మారడం, చావడం లేదా పారిపోవడం. వాళ్ళు పారిపోవాలని ఇచ్ఛపూర్వకంగా నిర్ణయించుకున్నారు.. ఇది ఇస్లాం మీకిచ్చిన స్వేచ్ఛ.. మీ అభిప్రాయాలను గౌరవించడంగా చూడాలి’. 

ఫాక్ట్ (నిజం): అరుంధతి రాయ్ కాశ్మీర్ పండిట్లను ఉద్దేశించి పోస్టులో ఆరోపించిన వ్యాఖలు చేసినట్లుగా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా ప్రచురించలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

అరుంధతి రాయ్ కాశ్మీర్ పండిట్లను ఉద్దేశించి పోస్టులో ఆరోపించిన వ్యాఖలు చేసారా అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా లభించలేదు. ఒక వేల అరుంధతి రాయ్ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలు మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు.

ఆ స్క్రీన్ షాట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘NDTV’ వారు 2018 లో అప్లోడ్ చేసిన వీడియోలో లభించింది. ఆ వీడియో లో అరుంధతి రాయ్ సామాజిక కార్యకర్తల అణచివేతకు సంబంధించి మాట్లాడారు.

‘Ralive, Tsaliv ya Galive’ (convert to Islam, leave the place or perish) (మతం మారడం, పారిపోవడం లేదా చావడం) అనేది 1990 లో కాశ్మీర్ పండిట్లను వెళ్లగొట్టడానికి ఉపయోగించిన నినాదం అని ‘India Today’ మరియు ‘ANI News’ ఆర్టికల్స్ లో చదవొచ్చు.

చివరగా, కాశ్మీర్ పండిట్లను ఉద్దేశించి అరుంధతి రాయ్ పోస్టులోని వ్యాఖ్యలు చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

1 Comment

scroll