Fake News, Telugu
 

ఈ ఫోటో సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్‌లో ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డప్పుడు తీసింది.

0

పూర్వం కాంగ్రెస్ పార్టీలో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు జవహర్ లాల్ నెహ్రూల స్థానాలు ఇలా ఉండేవంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పూర్వం కాంగ్రెస్ పార్టీలో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు జవహర్ లాల్ నెహ్రూల స్థానాలు తెలుపుతున్న ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్‌లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డప్పుడు తీసింది. ఈ ఫోటో కాంగ్రెస్ పార్టీలో, ఎల్లప్పుడు, ఎవరి స్థానం ఏంటి అని తెలపదు. అంతకముందు జవహర్ లాల్ నెహ్రూల (1929, 1930, 1936, 1937, 1946 (July-Sep), 1951-1954) మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ (1931) కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్‌గా చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో ఒక వెబ్సైటులో లభించింది. ఈ ఫోటో సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ లో ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డప్పుడు తీసింది. ఆ హరిపుర సెషన్‌కు సంబంధించిన విజువల్స్‌ ఇక్కడ చూడొచ్చు. అంతకముందు జవహర్ లాల్ నెహ్రూల (1929, 1930, 1936, 1937, 1946 (July-Sep), 1951-1954) మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ (1931) కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్‌గా చేసారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని 23 జనవరి 2022న భారతదేశం జరుపుకుంది, నేతాజీ జయంతిని “పరాక్రమ్ దివస్”గా కేంద్ర ప్రభుత్వం 2021లో గుర్తించింది. 1938లో నేతాజీ బోస్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లిన అదే రహదారిపై తనను కూడా హరిపుర ప్రజల తీసుకెళ్ళిన ఘటన మరచిపోలేనని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. నేతాజీ హరిపురలో బస చేసిన ప్రదేశాన్ని కూడా మోదీ సందర్శించానని తెలిపారు.

చివరగా, ఈ ఫోటో సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్‌లో ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డప్పుడు తీసింది.

Share.

About Author

Comments are closed.

scroll