Fake News, Telugu
 

2019లో రాజస్థాన్‌లో బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను, బీజేపీ వారిని పరిగెత్తించి తరుముతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అని అంటున్నారు.

0

బీజేపీ వారిని పరిగెత్తించి తరుముతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు” అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వీడియోలో బీజేపీ వారిని పరిగెత్తించి తరుముతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు.

ఫాక్ట్: ఈ వీడియో 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో రాజస్థాన్‌లో ఇద్దరు బీజేపీ నాయకుల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినప్పుడు తీసింది. 11 ఏప్రిల్ 2019న అజ్మీర్‌ జిల్లాలోని మసుడాలో జరిగిన ర్యాలీలో బీజేపీ అభ్యర్థి భగీరథ్ చౌదరి ఉండగా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుశీల్ కన్వర్ పాలారా భర్త భన్వర్ సింగ్ పాలారా మరియు బీజేపీ నాయకుడు నవీన్ శర్మ మధ్య ఘర్షణ జరిగింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో యూట్యూబ్‌లో లభించింది. 12 ఏప్రిల్ 2019న అప్లోడ్ చేసిన ఈ యూట్యూబ్‌ వీడియోలో, అజ్మీర్‌ రాజస్థాన్ ర్యాలీలో, బీజేపీకే చెందిన ఇద్దరు కార్యకర్తలు కొట్టుకున్నారని తెలిపారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుశీల్ కన్వర్ పాలారా భర్త భన్వర్ సింగ్ పాలారా, బీజేపీ నాయకుడు నవీన్ శర్మ మధ్య ఘర్షణ జరిగిందని వీడియో యొక్క వివరణలో తెలిపారు.

11 ఏప్రిల్ 2019న లోక్ సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగుతున్నప్పుడు, అజ్మీర్‌ జిల్లాలోని మసుడాలో జరిగిన ర్యాలీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ మరియు ఇక్కడ), మసుడాలో ఒక ర్యాలీలో ప్రసంగించడానికి బీజేపీ అభ్యర్థి భగీరథ్ చౌదరి వచ్చినప్పుడు ఈ ఘర్షణ జరిగింది. బీజేపీ లీడర్ నాయకుడు నవీన్ శర్మ మాట్లాడటానికి మైక్ పట్టుకున్నప్పుడు, మాజీ బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ కన్వర్ పాలారా భర్త భన్వర్ సింగ్ పాలారా లేచి నిలబడి నవీన్ చేతిలో నుండి మైక్ లాగడానికి ప్రయత్నించాడు. దీనిపై వారిద్దరూ గొడవకు దిగారు. తన ర్యాలీలో గందరగోళం చెలరేగడంతో బీజేపీ అభ్యర్థి భగీరథ్ చౌదరి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ గొడవకి సంబంధించిన వీడియో రిపోర్ట్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, 2019లో రాజస్థాన్‌లో బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను పట్టుకుని, బీజేపీ వారిని పరిగెత్తించి తరుముతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll