Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలో క్వారంటైన్‌ కేంద్రంగా కనిపిస్తున్నది కాణిపాకం ‘దేవాలయం’ కాదు, కాణిపాకంలోని ఒక నివాస కేంద్రం

3

ఒక చర్చి, మసీదు, ఇస్లాం యూనివర్సిటీ తిరుపతి లో వీటిలో ఏ ఒక్కటీ ఐసోలేషన్ వార్డులుగా చేయలేదు. కానీ మహోన్నతమైన కాణిపాకం వినాయక స్వామి దేవాలయాన్ని చేసింది ఈ ప్రభుత్వం. అది కూడా వాళ్ళ మతం కోసం డిల్లీ పోయొచ్చిన సాయుబుల కోసం చూడండి వాళ్ళు గుడిలోకి చెప్పులేసుకుని దేవస్థానం లోకి పోతున్నారు కనీస జ్ఞానం లేకుండా…’ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాణిపాకం వినాయక స్వామి దేవాలయాన్ని కొరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చిన ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్నది కాణిపాకం వినాయక స్వామి దేవాలయం కాదు. అది కాణిపాకంలో ఉన్న ‘శ్రీ గణేష్ సదన్’ అనే నివాస కేంద్రం. ఆ నివాస కేంద్రాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులోని వీడియోని సరిగ్గా గమనిస్తే, దాంట్లో ఒక బోర్డు మీద ‘శ్రీ గణేష్ సదన్’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు.

కావున, గూగుల్ లో ‘శ్రీ గణేష్ సదన్ కాణిపాకం’ అని వెతకగా, ‘శ్రీ గణేష్ సదన్’ అనే నివాస కేంద్రం కాణిపాకంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నివాస కేంద్రం ఫోటోలను చూడగా, వీడియోలో చూపెట్టిన బిల్డింగ్ ని చూడవొచ్చు. పోస్టులో చెప్పినట్టు అది దేవాలయం కాదు. అది నివాస కేంద్రం కాబట్టి గూగుల్ లో ఉన్న ఫోటోలలో కూడా ప్రజలు చెప్పులు వేసుకొని ఉన్నట్టు చూడవొచ్చు.

కాణిపాకం లోని ‘శ్రీ గణేష్ సదన్’ నివాస కేంద్రాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్టు ‘ఈనాడు’ ఆర్టికల్ లో చదవొచ్చు.

చివరగా, వీడియోలో క్వారంటైన్‌ కేంద్రంగా కనిపిస్తున్నది కాణిపాకం ‘దేవాలయం’ కాదు, కాణిపాకంలోని ఒక నివాస కేంద్రం.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll