ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు మరియు కొవ్వొత్తులు వెలిగించిన సమయంలో తీసిన ప్రత్యక్ష చిత్రాన్ని నాసా పంపిందని చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 05 April 2020 రోజున 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు మరియు కొవ్వొత్తులు వెలిగించిన సమయంలో నాసా తీసిన ప్రత్యక్ష చిత్రం.
ఫాక్ట్ (నిజం): పోస్టులోనిది నిజమైన ఫోటో కాదు. దాన్ని నాసా వారు తీయలేదు. అది ఒక 3డీరెండరింగ్. అంతేకాదు, ఎప్పటినుండో ఆ ఫోటో ఇంటర్నెట్ లో ఉంది. కావున పోస్ట్ లోచెప్పింది తప్పు.
పోస్టులోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ‘shutterstock’ వెబ్సైటులో చూడవొచ్చు. ఆ ఫోటో వివరణలో అది ఒక 3డీ రెండరింగ్ అని చదవొచ్చు. అంతేకాదు, ఎప్పటినుండో ఆ ఫోటో ఇంటర్నెట్ లో ఉంది. ఫోటో మీద ‘TIMES HOW’ (సెటైర్ వెబ్సైటు) (‘TIMES NOW’ కాదు) అని రాసి ఉనట్టు కూడా చూడవొచ్చు.
చివరగా, పాత 3డీ రెండరింగ్ ఫోటో పెట్టి, దీపాలు వెలిగించిన సమయంలో నాసా తీసిన ప్రత్యక్ష చిత్రం అంటూ షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?