Fake News, Telugu
 

భారత వైమానిక దళం త్రిశూల ఆకారంలో విన్యాసాలు చేస్తున్న ఈ ఫోటో డిజిటల్ గా రూపొందించారు

0

భారత సైన్యం త్రిశూల ఆకారంతో ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత సైన్యం త్రిశూల ఆకారాన్ని నిర్మిస్తూ ఆకాశంలో పరేడ్ నిర్వహిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): భారత రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన అనేక గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత వైమానిక దళం ఆకాశంలో త్రిశూల ఆకారాన్ని నిర్మిస్తూ విన్యాసాలు నిర్వహించింది. కాని, భారత వైమానిక దళం నిర్మించిన త్రిశూల ఆకార దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోలి లేవు. పోస్టులో షేర్ చేసిన ఫోటో డిజిటల్ గా సృష్టించబడింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి గూగల్ లో వెతికితే, దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో జరిగిన అనేక గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత వైమానిక దళం ఆకాశంలో త్రిశూల ఆకారాన్ని నిర్మిస్తూ పరేడ్ నిర్వహించినట్టు తెలిసింది. SU-30 MKI విమానాలు రాజ్ పథ్ సమీపంలో త్రిశూల ఆకారంతో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 2020 గణతంత్ర దినోత్సవ వేడుకలో నిర్వహించిన త్రిశూల విన్యాసాల ఫోటోని భారత వైమానిక దళం తమ ఫేస్బుక్ పేజిలో కూడా షేర్ చేసింది. కాని, భారత వైమానిక దళం నిర్మించిన త్రిశుల ఆకార దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోలి లేవు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా 04 మార్చ్ 2019 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. SU-30 విమానాలు గణతంత్ర దినోత్స వేడుకలలో త్రిశూల ఆకారంలో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలని తన ట్వీట్ లో తెలిపారు. కాని, తను షేర్ చేసిన ఫోటో పై మహాశివరాత్రి సందర్బంగా భారత వైమానిక దళానికి అంకితమిస్తున్న ఫోటో అని పేర్కొని ఉండటం మనం గమనించవచ్చు. ఈ ఫోటోని మొట్టమొదటగా కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ (KOEL) వారు 04 మార్చ్ 2019 నాడు మహా శివరాత్రి సందర్భంగా షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని ఎవరు రూపొందించారన్నది తెలియనప్పటికీ, ఈ ఫోటో డిజిటల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా సృష్టించబడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, భారత వైమానిక దళం త్రిశూల ఆకారంతో ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న దృశ్యంగా షేర్ చేస్తున్న ఈ ఫోటో డిజిటల్ గా సృష్టించబడినది.

Share.

About Author

Comments are closed.

scroll