Fake News, Telugu
 

ఈ వీడియో అనంతపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన హుండీ దొంగతనానికి చెందింది, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాదు.

0

“TTD (తిరుమల తిరుపతి దేవస్థానం).. లో జలగన్న గొర్రెల పెంపకం..” అని చెప్తూ ఒక మధ్య వయస్సు వ్యక్తి ఒక దేవాలయంలోని హుండీ నుండి డబ్బులు దొంగతనం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఈ వీడియో తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన హుండీ చోరీని చూపిస్తుంది.

 ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఒక దేవాలయంలో జరిగిన దొంగతనాన్ని చుపిస్తున్నా, ఇది తిరుమల దేవాలయంలో జరిగిన సంఘటన కాదు. అనంతపురం జిల్లాలో ఉన్న కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో చీఫ్ సెక్యూటిటీ ఆఫిసర్‌ కృష్ణారెడ్డి అక్కడ ఉన్న హుండీ నుండి దొంగతనం చేసి దొరికాడు. తన దొంగతనం CCTVలో నమోదు అయింది, ఈ దృశ్యాలు ఈ సంఘటనని చూపిస్తాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

క్లెయిమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా వైరల్ వీడియో కలిగి ఉన్న కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు లభించాయి.

వీటి ప్రకారం, ఇటీవల అనంతపురం జిల్లాలో ఉన్న కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఒక దొంగతనం జరిగింది. ఈ దొంగతనం చేసిన వ్యక్తి మరెవరో కాదు, ఆ దేవాలయం యొక్క చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణారెడ్డి. 

తను దొంగతనం చేస్తుండగా ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో చిక్కాయి. వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు ఇవే. వీటిని తిరుమల దేవాలయంలో జరిగిన దొంగతనానికి చెందిన దృశ్యాలు అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు. అదనంగా, తిరుమల దేవాలయంలో ఇటీవల కాలంలో ఏవైనా దొంగతనాలు జరిగాయా అని ఇంటర్నెట్‌లో వెతికితే, ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. 

చివరిగా, ఈ దొంగతనం దృశ్యాలు తిరుమల తిరుపతి దేవాలయంలో జరిగినవి కావు. 

Share.

About Author

Comments are closed.

scroll