ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును ఉగ్రవాదిగా ముద్ర వేస్తూ, కింగ్ చార్లెస్ III ఒక పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యాలు అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. యూరప్ మొత్తం నెతన్యాహును అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిందని, ఆ తర్వాత ఈ పోస్టర్‌ను అక్టోబర్ 2024లో ఆవిష్కరించారని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉగ్రవాదిగా ప్రకటిస్తూ కింగ్ చార్లెస్ III పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఒక వీడియో. దీని అసలు వెర్షన్ మే 2024 నాటిది. ఆ వీడియోలో కింగ్ చార్లెస్ తన అధికారిక పోర్ట్రెయిట్‌ను ఆవిష్కరించారు. అలాగే, యూరప్ నెతన్యాహును ఉగ్రవాదిగా ప్రకటించిందన్న వాదనను ధృవీకరించే ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను వెరిఫై చేయడానికి ముందుగా, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్‌లను ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా అసోసియేటెడ్ ప్రెస్ మరియు అనేక ఇతర మీడియా ఛానెల్‌లు (ఇక్కడ మరియు ఇక్కడ) మే 2024లో YouTubeలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో అసలు వెర్షన్ మాకు లభించింది.

తన పట్టాభిషేకం తర్వాత కింగ్ చార్లెస్ III తన మొదటి అధికారిక చిత్రపటాన్ని ఆవిష్కరించినప్పుడు తీసిన వీడియో ఇది. 14 మే 2024న UKలోని లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఆయన దీన్ని ఆవిషకరించారు.

రాయల్ ఫామిలీ వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేశారు, ఈ వీడియోలో మరియు ఇతర వార్తా కథనాలలో(ఇక్కడ మరియు ఇక్కడ), మీరు అతని పోర్ట్రెయిట్‌ను స్పష్టంగా చూడవచ్చు, వైరల్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇది బెంజమిన్ నెతన్యాహు పోస్టర్ కాదు. ఇందులో ఉన్న కింగ్ చార్లెస్ III పోర్ట్రెయిట్ స్థానంలో బెంజమిన్ నెతన్యాహును ఉగ్రవాదిగా ముద్రించే పోస్టర్‌ని డిజిటల్‌గా ఎడిట్ చేసి, వైరల్ వీడియోని తయారు చేశారు.
ఇదిలా ఉంచితే, యూరప్ నిజంగా నెతన్యాహును ఉగ్రవాదిగా ప్రకటించిందో లేదో చెక్ చేయడానికి మేము ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికాము. కానీ, ఈ క్లయిమ్‌కి మద్దుతుగా మాకు ఎలాంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు.
చివరిగా, కింగ్ చార్లెస్ III ఇజ్రాయెల్ PM బెంజమిన్ నెతన్యాహు యొక్క పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరిస్తున్న దృశ్యాలు అని చెప్పి ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.