Fake News, Telugu
 

వృద్ధాప్యం పాదాల నుండి పైకి ప్రారంభమవుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

వృధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వృధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది.

ఫాక్ట్: వృద్ధాప్యం పాదాల నుండి పైకి ప్రారంభమవుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వృద్ధాప్యం సంక్లిష్టమైనది, ఎందుకంటే అది విభిన్న శరీర భాగాలను వేరు వేరుగా ప్రభావితం చేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ గుండె, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు మొదలైన అనేక భాగాల పనితీరు క్షీణిస్తుంది. ఈ క్షీణత కేంద్రం ప్రతి ఒక్కరికీ శరీరంలోని ఒకే భాగంపై ఉండదు, వ్యక్తి వ్యక్తికీ మారుతుంది. ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కొరకు వారానికి కనీసం 150 నిమిషాల పాటు నడవడం ముఖ్యం. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, వినికిడి నష్టం (hearing loss), శుక్లాలు (cataracts), మధుమేహం, డిమెన్షియా, ఆస్టియో ఆర్థరైటిస్ మొదలైన వాటితో సహా వృద్ధాప్యానికి సంబంధించిన కొన్ని సాధారణ ఆరోగ్య పరిస్థితులు వస్తాయి. “ఒకరి వయసు పెరిగే కొద్దీ, వారు ఒకే సమయంలో అనేక పరిస్థితులను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.” వృధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుందని చెప్పలేదు.  

WHO ప్రచురించిన వరల్డ్ రిపోర్ట్ ఆన్ ఏజింగ్ అండ్ హెల్త్ ప్రకారం, వృద్ధాప్యాన్ని ప్రభావితం చేసే మార్పులు సంక్లిష్టమైనవి (complex). “జీవ స్థాయిలో, వృద్ధాప్యంలో వివిధ రకాల అణు మరియు కణ నష్టం క్రమంగా జరుగుతుంది. కాలక్రమేణా, ఈ నష్టం శారీరక నిల్వలు క్రమంగా తగ్గడానికి దారితీస్తుంది, అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది, మరియు వ్యక్తి సామర్థ్యం సాధారణంగా తగ్గుతుంది. చివరికి, అది మరణానికి దారితీస్తుంది.”  ఈ మార్పులు కూడా స్థిరంగా ఉండవని తెలిపారు.

ఒక వయస్సు పెరిగే కొద్దీ గుండె, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు మొదలైన అనేక భాగాల పనితీరు క్షీణిస్తుంది. ప్రతి ఒక్కరికీ శరీరంలోని పాదాలనుంచి మొదలవ్వాలని లేదు.

పాదాలు మరియు వృద్ధాప్యం:

పాదాలు శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. ఎందుకంటే నడవడం, పరిగెత్తడం మరియు ఎక్కడం వంటి అనేక విభిన్న కార్యకలాపాలను పాదాల ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఒకరు పెద్దయ్యాక, చర్మం సన్నబడుతుంది, పాదాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. “పాదం యొక్క లిగమెంట్లు, ఫాసియా మరియు చర్మం స్థితిస్థాపకతను (elasticity) కోల్పోవడం ప్రారంభిస్తాయి, చర్మం గట్టిపడటం ప్రారంభిస్తుంది.” ఇలా౦టి అనేక మార్పులు జరుగుతు౦టాయి, కానీ వృద్ధాప్య౦ పాదాల ను౦డి పైకి మొదలౌతు౦దనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

సిడిసి ప్రకారం, ఎక్కువ కదలడం, మరియు రోజంతా తక్కువగా కూర్చోవడం ఒకరి శరీరానికి మంచిది మరియు ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సహాయపడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాలు నడవడం సాధారణంగా సిఫారసు చేయబడుతుంది.

ఒక అధ్యయనం ప్రకారం, రెండు వారాలపాటు నిష్క్రియాత్మకత (inactivity) వల్ల వృద్ధులకు మరియు యువకులకు కాళ్ల కండరాల బలం తగ్గుతుందని తెలిపారు. కానీ, వృధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుందని ఎక్కడా తెలపలేదు.  

చివరగా, వృద్ధాప్యం పాదాల నుండి పైకి ప్రారంభమవుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll