Fake News, Telugu
 

2019లో సూరత్‌లో కొందరు ముస్లింలు ఒక బస్సును ధ్వంసం చేసిన దృశ్యాలు, ఇటీవల కర్ణాటకలో జరిగిన ఒక సంఘటనవిగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక నీలి రంగు బస్సును కొందరు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఉన్న ఒక వీడియోను, ఇది ఇటీవల కర్ణాటకలో జరిగిన సంఘటనకి చెందిన విజువల్స్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒక ముస్లిం మహిళకి బస్సులో సీట్ ఇవ్వనందున, ముస్లింలు ఇలా బస్సుపై దాడికి పాల్పడ్డారు అని ఈ పోస్ట్ ద్వారా క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో, ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: కర్ణాటకలో ఒక ముస్లిం మహిళకి బస్సులో సీట్ ఇవ్వనందుకు, ముస్లింలు ఆ బస్సుపై దాడి చేసారు. 

ఫాక్ట్(నిజం): 2019లో సూరత్‌లో mob lynchingకి వ్యతిరేఖంగా కొందరు ముస్లింలు చేపట్టిన ఒక ర్యాలీ సందర్భంగా వాళ్ళు రోడ్డుపై ఉన్న బస్సుల మీద రాళ్లు రువ్వి, వాటిని ధ్వంసం చేసారు. వైరల్ వీడియో ఈ సంఘటనకు చెందినది. కావున పోస్టులో చేస్తున్న  క్లెయిమ్ తప్పు

వీడియోను జాగ్రత్తగా గమనిస్తే, ధ్వంసమైన బస్సుపై ‘సిటిలింక్’ అని రాసి ఉండటం చూడచ్చు. ఒక ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా, సిటిలింక్ లేదా సూరత్ BRTS అనేది గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న పబ్లిక్ బస్సు రవాణా వ్యవస్థ అని తెలిసింది

సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఈ సంఘటన గురించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతకగా, దివ్యాంగ్ న్యూస్ ఛానెల్ జూలై 2019లో ప్రచురించిన ఒక వీడియోలో, వైరల్ వీడియోలో విధ్వంసానికి గురైన బస్సు యొక్క దృశ్యాలను పోలిన దృశ్యాలు కనిపించాయి. వీడియో యొక్క వివరణలో, “Surat Police fire tear gas shells as rally against mob lynching incidents turns violent” 

దేశంలో జరుగుతున్న mob lynching సంఘటనలకు వ్యతిరేకంగా, Versatile Minorities Forum(VMF) అనే సంస్థకు చెందిన కొందరు ముస్లింలు, 2019లో సూరత్‌లో ఒక ర్యాలీ నిర్వహించింది. ఇది హింసాత్మకంగా మారటంతో, పోలీసులు Tear-గ్యాస్ ఫైర్ చెయ్యవలసి వచ్చింది. ఈ సంఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డట్టు ఈ సంఘటనపై వచ్చిన వార్త కథనాలు పేర్కొన్నాయి. ఈ సంఘటనపై వచ్చిన కొన్ని వార్తా కథనాలు మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.   

చివరగా, 2019లో గుజరాత్‌లో జరిగిన ఒక పాత సంఘటనకి చెందిన వీడియోని, కర్ణాటకలో ఇటీవల జరిగినది ఒక సంఘటనకి చెందినదిగా వైరల్ పోస్టులో తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll