Fake News, Telugu
 

ఈ కవితను రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

“ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్బుతమైన కవిత” అంటూ ఒక కవితను పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్బుతమైన కవిత.

ఫాక్ట్: ఈ కవితను రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు. ఈ కవితను మలేషియాకు చెందిన షరినా సాద్ అనబడే కవయిత్రి రాసినట్టు హలో పోయెట్రీ వెబ్సైటు ద్వారా తెలుస్తుంది. కానీ, వివిధ ఫోరమ్స్ మరియు సోషల్ మీడియాలో ఈ కవిత రాసింది సింగపూర్ కవియిత్రి లీ ట్జు ఫింగ్ అని కొందరు, నైజీరియన్ గోస్పెల్ సింగర్ సాంసొంగ్ షేర్ చేసారని కొందరు అంటున్నారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.  

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ కవితను రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినట్టు ఎటువంటి కచ్చితమైన ఆధారాలు దొరకలేదు. పోస్టులోని కవితను ఇంగ్లీష్‌లో అనువదించి గూగుల్లో వెతకగా, అదే కవిత హలో పోయెట్రీ వెబ్సైటులో లభించింది. ఈ కవితను జులై 2013న మలేషియాకు చెందిన షరినా సాద్ అనబడే కవయిత్రి రాసినట్టు తెలుస్తుంది.

కానీ, వివిధ ఫోరమ్స్ మరియు సోషల్ మీడియాలో ఈ కవిత రాసింది సింగపూర్ కవియిత్రి లీ ట్జు ఫింగ్ అని కొందరు, నైజీరియన్ గోస్పెల్ సింగర్ సాంసొంగ్ షేర్ చేసారని కొందరు అంటున్నారు.

రవీంద్రనాథ్ ఠాగూర్, ఈ కవితలో చెప్పిన విషయం లాగే ఒక కోట్ చెప్పినట్టు ఈ వెబ్ సైట్ ద్వారా చూడొచ్చు.

చివరగా, ఈ కవితను రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll