Fake News, Telugu
 

పాత వీడియోని భారత సైన్యం ఇటీవల చైనా సరిహద్దుల్లో మిలిటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

భారత సైన్యం ఇటీవల చైనా సరిహద్దుల్లో మిలిటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని తాము అంగీకరించట్లేదని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.  ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత సైన్యం ఇటీవల చైనా సరిహద్దుల్లో మిలిటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 జనవరి నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. 2019లో భారత సైన్యం రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రన్‌లో BM-21 మిస్సైల్స్‌లని లంచ్ చేసిన దృశ్యాలు, ఈ వీడియోలోని దృశ్యాలతో పోలి ఉన్నాయి. ఈ మిలిటరీ రిహార్సల్ ఇటివల చైనా సరిహద్దులలో నిర్వహించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు కనీసం 2021 జనవరి నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. భారత సైన్యం రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రన్‌లో BM-21 గ్రేడ్ ఆర్టిలరీని ఫైర్ చేస్తున్న దృశ్యాలని ఒక యూసర్ వీడియో వివరణలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన అధికారిక సమాచారం కోసం వెతకగా, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న వీడియోని ‘India TV’ న్యూస్ సంస్థ 22 అక్టోబర్ 2019 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. భారత ఆర్మీ, భారత సైనిక దళం సంయుక్తంగా నిర్వహించిన మిలిటరీ ఎక్షర్‌సైస్‌లో భారత సైన్యం BM-21 గ్రేడ్ ఆర్టిలరీని ఫైర్ చేస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, ఇటీవల భారత సైన్యం చైనా సరిహద్దుల్లో రిహార్సల్స్ చేస్తున్న దృశ్యాలు కావని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా,  పాత వీడియోని భారత సైన్యం ఇటీవల చైనా సరిహద్దుల్లో మిలిటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll