“భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న దేశాద్రోహులను పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళను మేం రానివ్వం. వాళ్ళు వారి స్వంత దేశానికే పనికిరానప్పుడు మాకేం పనికొస్తారు. సొంత దేశానికే నమ్మక ద్రోహం చేసిన వారిని ఎవరు నమ్ముతారు” అని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్ అన్నట్టు ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న దేశాద్రోహులను పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళను మేం రానివ్వం. వాళ్ళు వారి స్వంత దేశానికే పనికిరానప్పుడు మాకేం పనికొస్తారు. సొంత దేశానికే నమ్మక ద్రోహం చేసిన వారిని ఎవరు నమ్ముతారు” -పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్.
ఫాక్ట్: భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిపై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసారని చెప్పడానికి ఆధారాలు దొరకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, మర్యం నవాజ్ షరీఫ్ అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.
మర్యం నవాజ్ షరీఫ్ అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్, మరియు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం లేదు.
భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఇంతకముందు కొంతమంది నినాదాలు చేసినప్పటికీ, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్ వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు.
చివరగా, భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిపై మర్యం నవాజ్ షరీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసారని ఆధారాలు లేవు.