Fake News, Telugu
 

‘అమెరికాలో జారీచేసిన నీతిమంతుల జాబితాలో మోదీ ప్రథమ స్థానం’ అనే పాత ఫేక్ న్యూస్ ని మళ్ళీ షేర్ చేస్తున్నారు

0

అమెరికాలో జారీచేయబడిన అత్యంత నీతిమంతుల జాబితాలో 50 మంది నేతలలో ప్రథమ స్థానంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ’, అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెరికాలో జారీ చేయబడిన అత్యంత నీతిమంతుల జాబితాలో ప్రథమ స్థానంలో ప్రధాని మోదీ.

ఫాక్ట్: అమెరికాలో అలాంటి జాబితా ఒకటి రిలీజ్ చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల నాయకుడు అంటూ ఏ ప్రముఖ సర్వే సంస్థ ప్రకటించదు. ప్రధాని మోదీ కి ఆ గౌరవం దక్కినట్లుగా ఏ అధికారిక సంస్థ వెల్లడించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అలాంటి జాబితా ఒకటి అమెరికాలో రిలీజ్ అయినట్టు ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. ‘Morning Consult’ అనే అమెరికన్ రీసెర్చ్ సంస్థ వారి సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడి గా ప్రధాని మోదీ నిలిచినట్టు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో చదవొచ్చు. ఇదే విషయం ‘Morning Consult’ వారి వెబ్సైటులో కూడా చూడవొచ్చు.

కొన్ని పాత సర్వేల్లో కూడా ప్రధాని మోదీ పేరుని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు ‘ఫోర్బ్స్ పవర్ఫుల్ పీపుల్‘, ‘గాలప్ ఇంటర్నేషనల్ – గ్లోబల్ లీడర్స్ యొక్క అభిప్రాయం‘, ‘ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లలో అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తి‘, మరియు ‘బ్లూమ్బెర్గ్ మార్కెట్లలో అత్యంత ప్రభావవంతడైన వ్యక్తుల యొక్క ర్యాంకింగ్స్‘ లకు సంబంధించిన సమాచారం చూడవొచ్చు. కానీ, పోస్ట్ లో పేర్కొన్న సర్వే గురించి గానీ, ప్రధాని మోదీ కి లభించినట్లుగా అటువంటి ర్యాంకింగ్ గురించి గానీ ఎటువంటి సమాచారం దొరకలేదు.

ఒకవేళ నిజంగానే అలాంటి ఒక సర్వే లో ప్రధాని మోదీ కి ప్రథమ స్థానం వస్తే, అన్నీ ప్రముఖ వార్తాసంస్థలు ఆ వార్తను ప్రచురించేవి. కానీ, ఎవరూ కూడా అటువంటి వార్తను ప్రచురించలేదు. ఇదే ఫేక్ పోస్ట్ ని 2019 లో కూడా కొంత మంది షేర్ చేసినప్పుడు, అది ఒక ఫేక్ న్యూస్ అని FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. అంతేకాదు, అమెరికన్ ‘వైట్ హౌస్’ తమ సర్వేలో మన్మోహన్ సింగ్‌ను ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా పేర్కొందని ఇంతకముందు మరో పోస్ట్ వైరల్ అవ్వగా, అది కూడా తప్పేనని చెప్తూ FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో అత్యంత నీతిమంతుల జాబితాని ఏ ప్రముఖ అమెరికా సంస్థ వెల్లడించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll