Fake News, Telugu
 

ఈ ‘Jobs Calender’ మద్యం బ్రాండ్ ఫోటో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై వ్యంగ్యంగా సృష్టించిన మార్ఫ్ చేసిన ఫోటో

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘Jobs Calender’ అనే పేరు కలిగిన మద్యం బ్రాండ్ బాటిల్ ని తమ రాష్ట్రంలో విక్రయిస్తునట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘Jobs Calender’ అనే పేరుతో ఉన్న మద్యం బ్రాండ్ ని తమ రాష్ట్రంలో విక్రయిస్తుంది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రయిస్తున్న ‘President Medal’ మద్యం బాటిల్ పై ‘Jobs Calender’ పేరుని ఎడిట్ చేసి ఇలా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. యస్. జగన్  ‘2021 జాబ్ క్యాలెండర్’ ని విడుదల చేస్తున్న నేపథ్యంలో, ఈ ఎడిటెడ్ ఫోటోని వ్యంగ్యంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే,  ‘Jobs Calender’ అనే పేరుతో ఎటువంటి మద్యం బ్రాండ్ లేదని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటోని ఇటీవల చాలా మంది ఫేస్బుక్ యూసర్లు వ్యంగ్యంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఫోటోలో కనిపిస్తున్న మద్యం బాటిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రయం చేస్తున్న ‘President Medal’ మద్యం బ్రాండ్ బాటిల్ తో పోలి ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మబడుతున్న ‘President Medal’ మద్యం బ్రాండ్ పేరు పై నెటిజన్లు కామెడీ మిమ్స్ రూపొందించినట్టు ‘సమయం’ న్యూస్ వెబ్సైటు తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. ‘సమయం’ ఆర్టికల్ లో పబ్లిష్ అయిన ‘President Medal’ మద్యం బాటిల్, పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోలి ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీనిబట్టి, ‘President Medal’ మద్యం బ్రాండ్ బాటిల్ స్టికర్ పై ‘Jobs Calender’ అనే పేరుని ఎడిట్ చేసి ఇలా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా షేర్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది.

ఇదివరకు, ‘President Medal’ మద్యం బాటిల్ పై ‘Special Status’ పేరుని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినప్పుడు, ‘Special Status’ అనే పేరుతో ఉన్న మద్యం బ్రాండ్ ఏది తాము అమ్మడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవిరెజేస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు స్పష్టం చేసారు. ఈ వివరాల ఆధారంగా ‘Jobs Calender’ పేరుతో ఉన్న మద్యం బ్రాండ్ ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ముఖ్యమంత్రి వై. యస్. జగన్  మోహన్ రెడ్డి ‘ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2021’ ని 18 జూన్ 2021 నాడు ప్రకటించనున్న నేపథ్యంలో, ఈ ఎడిటెడ్ ఫోటోని వ్యంగ్యంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది.

చివరగా, ‘Jobs Calender’ పేరుతో ఉన్న మద్యం బ్రాండ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయిస్తునట్టుగా షేర్ చేస్తున్నది వ్యంగ్యంగా సృష్టించబడిన ఒక ఎడిటెడ్ ఫోటో.

Share.

About Author

Comments are closed.

scroll