Fake News, Telugu
 

మోడీని అత్యంత నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా ఏ అమెరికన్ సర్వే సంస్థ వెల్లడించలేదు

0

ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల నాయకుడిగా మన ప్రధాని నరేంద్ర మోడీని ఒక అమెరికన్ సర్వేలో పేర్కొన్నట్లుగా పలువురు ఫేస్బుక్ వినియోగదారులు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల నాయకుడిగా మన దేశ  ప్రధాని నరేంద్ర మోడీని ఒక అమెరికన్ సర్వే సంస్థ పేర్కొన్నది

ఫాక్ట్ (నిజం):ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల నాయకుడు అంటూ ఏ సర్వే సంస్థ ప్రకటించదు. ప్రధాని మోడీకి ఆ గౌరవం దక్కినట్లుగా ఏ అధికారిక సంస్థ వెల్లడించలేదు. కావున, పోస్ట్ లో చేసిన ఆరోపణల్లో నిజం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు తమ సర్వేల్లో ప్రధాని మోడీని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు ‘ఫోర్బ్స్ పవర్ఫుల్ పీపుల్‘, ‘గాలప్ ఇంటర్నేషనల్ – గ్లోబల్ లీడర్స్ యొక్క అభిప్రాయం‘, ‘ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లలో అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తి‘, మరియు ‘బ్లూమ్బెర్గ్ మార్కెట్లలో అత్యంత ప్రభావవంతడైన వ్యక్తుల యొక్క ర్యాంకింగ్స్‘ లకు సంబంధించిన సమాచారం లభించింది. కానీ పోస్ట్ లో పేర్కొన్న సర్వే గురించి గానీ, ప్రధాని మోడీకి లభించినట్లుగా అటువంటి ర్యాంకింగ్ గురించి గానీ ఎటువంటి సమాచారం లేదు.

సాధారణంగా, మన దేశ ప్రధాని ఇతర దేశాల్లో ఏదైనా పురస్కారం గెలుచుకున్నప్పుడు, మన కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక ప్రజా సంబంధాల విభాగం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.)’ ద్వారా నివేదించబడుతుంది. కానీ పోస్ట్ లో పేర్కొన్న సర్వేలో ప్రధాని మోడీకి దక్కిన గౌరవం గురించి ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల నాయకుడు మోడీ అంటూ ఏ సర్వే సంస్థ ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll