ఒక జంట సన్నిహితంగా ఉన్న ఫోటోను ఫేస్బుక్ లో పోస్ట్ చేసి షహీన్ బాగ్ నిరసన కి సంబంధించిన ఫోటోలు అని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్ట్ యొక్క క్లెయిమ్ లో ఎంత నిజం ఉందో పరిశీలిద్దాం.

క్లెయిమ్: షహీన్ బాగ్ నిరసనలో ఒక జంట సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఆ ఫోటో ఇంటర్నెట్ లో మార్చ్ 2018 నుండే ఉన్నట్టు తెలిసింది. కానీ, షహీన్ బాగ్ నిరసనలు ఇటీవల డిసెంబర్, 2019 లోనే మొదలు అయ్యాయి. కావున, ఆ పోస్ట్ లో చేసిన క్లెయిమ్ అబద్ధం.
పోస్ట్ లోని ఫోటోను ‘yandex’ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతకగా, అదే ఫోటోని ట్విట్టర్ లో ఒకతను మార్చ్, 2018 లోనే ట్వీట్ చేసినట్టు తెలిసింది. కానీ, షహీన్ బాగ్ నిరసనలు CAA (Citizenship Amendment Act) పార్లమెంట్లో పాస్ కాగానే దానికి వ్యతిరేకంగా డిసెంబర్, 2019 లో ప్రారంభం అయ్యాయి .
చివరగా, ఏ సంబంధం లేని ఒక పాత ఫోటోను పోస్ట్ చేసి షహీన్ బాగ్ నిరసనల్లో ఒక జంట సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోగా తప్పు ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?