Fake News, Telugu
 

‘ది ఒమిక్రాన్ వేరియంట్’ అనే పేరుతో 1963లో ఎటువంటి సినిమా రాలేదు; ఆ పేరుతో ఉన్న ఈ ఫోటో ఫోటోషాప్ చేయబడింది

0

‘ది ఒమిక్రాన్ వేరియంట్’ అనే పేరుతో ఉన్న పోస్టర్ యొక్క ఫోటోను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. 1963లో ఈ సినిమా వచ్చిందని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1963లోనే ‘ది ఒమిక్రాన్ వేరియంట్’ అనే పేరుతో వచ్చిన సినిమా యొక్క పోస్టర్.

ఫాక్ట్: ‘ది ఓమిక్రాన్ వేరియంట్’ అనే పేరుతో 1963లో సినిమా రాలేదు. ‘Sucesos en la IV Fase” అనబడే సినిమా యొక్క పోస్టర్ ను ఎడిట్ చేసి ‘ది ఒమిక్రాన్ వేరియంట్’ అనే పేరును ఆడ్ చేసారు. ఒమిక్రాన్ పేరుతో రెండు సినిమాలు IMDb వెబ్సైటులో లభించాయి. ఒక సినిమా పేరు ఒమిక్రాన్, అది 1963లో వచ్చింది. మరో సినిమా ‘ది విసిటర్ ఫ్రం ప్లానెట్ ఒమిక్రాన్’, అది 2013లో వచ్చింది. కానీ, ‘ది ఒమిక్రాన్ వేరియంట్’ పేరుతో ఎటువంటి సినిమా ఇంటర్నెట్‌లో దొరకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.     

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేయటంతో, ఈ క్లెయిమ్ బాగా వైరల్ అయ్యింది.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఫోటో ఒకటి స్పానిష్ వెబ్సైటులో లభించింది. కానీ, ఇది 1974లో వచ్చిన ‘Sucesos en la IV Fase” అనబడే సినిమా యొక్క పోస్టర్ అని తెలుస్తుంది. ‘ఫేస్ 4’ అనే ఈ సినిమా గురించి ఇతర వెబ్ సైట్స్ లో ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. అందులో కూడా పై వెబ్సైటులో ఉన్నట్టుగానే పోస్టర్ లు ఉన్నాయి కానీ, ఎందులో కూడా ‘ది ఒమిక్రాన్ వేరియంట్’ పేరుతో సినిమా లేదు.

పోస్టులోని ఫోటోను మరియు ఫేస్ 4 సినిమా యొక్క ఫోటోను పోల్చి చూసినప్పుడు, సినిమా పేరును ఎడిట్ చేసి, ‘ది ఒమిక్రాన్ వేరియంట్, అని మార్చినట్టు చూడొచ్చు.

ఒక ట్విట్టర్ యూసర్, తను 28 నవంబర్ 2021న చేసిన ట్వీట్‌లో ‘ది ఒమిక్రాన్ వేరియంట్’ అనే పదాలతో 1970ల్లో వచ్చిన సై-ఫై సినిమాల పోస్టర్లను ఫోటోషాప్ చేసినట్టు తెలిపారు. ట్వీట్‌లో చేసిన పోస్టర్లు బాగా వైరల్ అవడంతో మరో ట్వీట్‌లో ఇది ఒక జోక్ అని కూడా తెలిపారు.

ఒమిక్రాన్ పేరుతో రెండు సినిమాలు IMDb వెబ్సైటులో లభించాయి. ఒక సినిమా పేరు ఒమిక్రాన్, అది 1963లో వచ్చింది. మరో సినిమా ‘ది విసిటర్ ఫ్రం ప్లానెట్ ఒమిక్రాన్’, అది 2013లో వచ్చింది. కానీ, ‘ది ఒమిక్రాన్ వేరియంట్’ పేరుతో ఎటువంటి సినిమా మాకు ఇంటర్నెట్‌లో దొరకలేదు.   

చివరగా, ‘ది ఒమిక్రాన్ వేరియంట్’ అనే పేరుతో 1963లో ఎటువంటి సినిమా రాలేదు; ఆ పేరుతో ఉన్న ఈ ఫోటో ఫోటోషాప్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll