Fake News, Telugu
 

మమతా బెనర్జీ ముస్లిం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

0

మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం మతానికి చెందింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం. ఆమె కలకత్తా యూనివర్సిటీ నుండి “హిస్టరీ అఫ్ ఇస్లాం”లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.

ఫాక్ట్(నిజం): మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం అని చెప్పాడానికి ఎలాంటి రిపోర్ట్స్ లేవు. ఆమె తల్లిదండ్రులైన గాయత్రీ దేవి, ప్రోమీలేశ్వర్ బెనర్జీ ఇద్దరు హిందూ మతానికి చెందినవారు. 2011లో మమతా బెనర్జీ తల్లి గాయత్రీ దేవి మరణించగా ఆమె అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ క్లెయిమ్ గురించి తగిన కీవర్డ్స్  ఉపయోగించి ఇంటర్నెట్ లో వెతకగా, మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం అని చెప్పే ఎలాంటి ఆధారాలు లభించలేదు.

అలాగే మమతా బెనర్జీ తల్లిదండ్రులైన గాయత్రీ దేవి, ప్రోమీలేశ్వర్ బెనర్జీ ఇద్దరు హిందూ మతానికి చెందినవారు అని రిపోర్ట్స్ లభించాయి. మమతా బెనర్జీ తల్లి గాయత్రీ దేవి 2011లో మరణించగా ఆమె అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినట్లు పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ & ఇక్కడ).

మమతా బెనర్జీ 27 జనవరి 2021న ఇండియాటుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను హిందువు అని, తను కాళీ మాతను పూజిస్తాను తెలిపారు. అలాగే తన హిందుత్వానికి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని మమత బెనర్జీ అన్నారు. హిందూ మతంపై చర్చకి తాను సిద్ధం అని తెలిపారు.ఈ సమచారం ఆధారంగా మమతా బెనర్జీ, ఆమె తల్లిదండ్రులు హిందువులని నిర్థారించవచ్చు.

అలాగే మమతా బెనర్జీ చదువుకి సంబంధించిన సమాచారం కోసం వెతకగా ఆమె “ఇస్లాం హిస్టరీ ”లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్టు రిపోర్ట్స్ లభించాయి.

చివరగా, మమతా బెనర్జీ ముస్లిం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll