Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఇండియాలో ఇప్పటివరకు ఒక్క కొరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. ‘గాంధీ హాస్పిటల్ లో నలుగురు మృతి’ అనేది ఫేక్ మెసేజ్

0

అలర్ట్ అలర్ట్ కరోనా వైరస్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది గాంధీ హాస్పిటల్ లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ వైరస్ చైనా నుంచి భారత్ కు వ్యాపించినట్లు నిపుణులు చెబుతున్నారు’ అని ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: గాంధీ హాస్పిటల్ లో వందకు పైగా కొరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, నలుగురు మృతి చెందారు. 

ఫాక్ట్ (నిజం): ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడా కూడా ఒక్క కొరోనా వైరస్ కేసు నమోదు కాలేదు. కేవలం అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా కొందరిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

హైదరాబాద్ లో కొరోనా వైరస్ కేసుల గురించి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ – ‘కొరోనా వైరస్ ఉండొచ్చనే అనుమానంతో ఇంతకు ముందు ఐదుగురు, ఈ రోజు ముగ్గురు ఫీవర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ముందు ఐదుగురులో కొరోనా వైరస్ ఉన్నట్టు ఎవరికీ కూడా నిర్ధారించబడలేదు. ఈరోజు జాయిన్ అయిన వారు చైనా నుండి వచ్చినందున, వారికి ఏమైనా వ్యాధి లక్షణాలు ఉంటే, వారి సాంపిల్స్ కూడా టెస్టుకు పంపిస్తాము’ అని అన్నారు. పూర్తి ఇంటర్వ్యూ ని ఇక్కడ చూడవొచ్చు. ముందు జాగ్రత్తగా గాంధీ హాస్పిటల్ లో కూడా ఐసోలేషన్ వార్డ్ ని తాయారు చేసి ఉంచారు. అంతేకానీ, పోస్ట్ లో చెప్పినట్టు వందకు పైగా గాంధీ హాస్పిటల్ లో కొరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. నలుగురు మృతి చెందరనేది కూడా తప్పు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ కూడా ఇంతవరకు భారతదేశంలో ఒక్క కొరోనా వైరస్ కేసు కూడా నమోదు అవ్వలేదని తెలిపారు. కేవలం ముందు జాగ్రత్తగా అనుమానం ఉన్నవారిని హాస్పిటల్ లో జాయిన్ చేసామని చెప్పారు. 27 జనవరి 2020 వరకు టెస్ట్ చేసిన సాంపిల్స్ అన్నీ నెగటివ్ (వ్యాధి లేదు) వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వారు ట్వీట్ చేసారు.

చివరగా, ఇండియాలో ఇప్పటివరకు ఒక్క కొరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. ‘గాంధీ హాస్పిటల్ లో నలుగురు మృతి’ అనేది ఫేక్ మెసేజ్

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll