Fake News, Telugu
 

పాత ఫోటోలు పెట్టి, తాజా ఉత్తరాఖండ్ అడవి మంటలకు సంబంధించినవని షేర్ చేస్తున్నారు

0

ఫేస్బుక్ లో రెండు ఫోటో లను పోస్టు చేసి, అవి ఉత్తరాఖండ్ తాజా అడవి మంటలకి సంబంధించినవని సోషల్ మీడియా లో చాలా మంది చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలు తాజాగా ఉత్తరాఖండ్ లోని అడవులలో చెలరేగిన మంటలకి సంబంధించినవి. 

ఫాక్ట్ (నిజం): ఉత్తరాఖండ్ అడవులలో తాజాగా మంటలు చెలరేగాయి. కానీ ఫోటోలు ఆ ఘటనకి సంబంధించినవి కావు. అవి చాలా సంవత్సరాలుగా ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా చూడవచ్చు. కావున గతం లో జరిగిన అడవి మంటల ఫోటోలను పెట్టి అవి తాజాగా ఉత్తరాఖండ్ అడవులలో చెలరేగిన మంటలవని తప్పుగా షేర్ చేస్తున్నారు.    

ఫోటో-1:

ఫోటో 2016 లో టెక్సాస్ (అమెరికా) లో జరిగిన అడవి మంటలకి సంబంధించినది.

ఫోటో-2:

ఫోటో ని ‘Anup Sah Photography’ అనే ఫేస్బుక్ పేజ్ లో 28 ఏప్రిల్ 2016 న అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది.

పోస్టులోని ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోలు అదే ఆరోపణ తో సోషల్ మీడియా లో వైరల్ అవడంతో ‘PIB in Uttarakhand’ వారు అవి తాజాగా ఉత్తరాఖండ్ లోని అడవులలో చెలరేగిన మంటలకి సంబంధించినవి కాదని ట్వీట్ చేసారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రం తీవ్ర సంక్షోభం లో ఉందని చాలా మంది పోస్టులు పెడ్తుండడంతో, 25 మే 2020 వరకు అడవి మంటలు వ్యాపించింది సుమారు 80 హెక్టార్ల విస్తీర్ణంలోనే అని, అది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5% మాత్రమే అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు PIB in Uttarakhand ట్వీట్ చేసారు.

సోషల్ మీడియా లో ఉత్తరాఖండ్ అటవీ మంటల గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని అనేక అటవీ శాఖ మరియు పోలీసు అధికారులు కూడా ట్వీట్ చేసి తెలిపారు.

చివరిగా, పాత ఫోటోలు పెట్టి, తాజా ఉత్తరాఖండ్ అడవి మంటలకు సంబంధించినవని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll