Coronavirus Telugu, Fake News, Telugu
 

అమెరికాలోని పాత కోవిడ్ సెంటర్ల ఫోటోలను పెట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు

0

జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లోని కల్యాణ మండపాలను, సినిమా హాళ్ళను కోవిడ్ సెంటర్లుగా మారుస్తున్నట్టు కొన్ని ఫోటోలను ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: కల్యాణ మండపాలను, సినిమా హాళ్ళను కోవిడ్ సెంటర్లుగా మార్చిన జగన్ ప్రభుత్వం, వాటికి సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్: పోస్ట్ లో పెట్టిన రెండు ఫోటోలు అమెరికాలోని కోవిడ్ సెంటర్లవి. మొదటి ఫోటో న్యూ యార్క్ సిటీ లోని జార్విత్స్ కన్వెన్షన్ సెంటర్ ది. మార్చి 2020 లో అప్పటి కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల కొరకు చేసిన బెడ్ ల నిర్మాణనికి సంబంధించిన ఫోటో ఇది. రెండొవ ఫోటో కూడా కోవిడ్ ఎమర్జెన్సీ కొరకు అప్పట్లో నిర్మించినదే, కానీ అది ఒహయో స్టేట్ గ్రేటర్ కొలంబస్ కన్వెన్షన్ సెంటర్ లోనిది. రెండు ఫోటోలకు ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఫోటో 1 :

మొదటి ఫోటో ని బింగ్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, పిసిఎంఏ (pcma) అనే వెబ్సైటు కి తీసుకెళ్తుంది. ఆ వెబ్సైటులోని ఆర్టికల్ లో పోస్ట్ లోని ఫోటో ఉంది, ఆ ఫోటో యొక్క వివరణలో అది జార్విత్స్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించింది అని తెలిపారు. ఆ పేరుతో అడ్వాన్స్డ్ గూగుల్ సెర్చ్ చేసినప్పుడు, ఈ ఫోటో ‘ABC న్యూస్ 7’ వారు తీసిన వీడియో లో మనకు కనబడుతుంది. ఆ వీడియో లో న్యూ యార్క్ సిటీ అధికారులు జార్విత్స్ అనే కన్వెన్షన్ సెంటర్ ని  కోవిడ్-19 ఎమర్జెన్సీ మూలాన ఒక కోవిడ్ సెంటర్ గా మారుస్తున్నట్టు తెలిపారు.

ఫోటో 2:

రెండో ఫోటోని బింగ్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, కొలంబస్ అండర్ గ్రౌండ్ అనే వెబ్ సైట్ లోని ఆర్టికల్ కు దొరికింది. కోవిడ్-19 వలన గ్రేటర్ కొలంబస్ కన్వెన్షన్ సెంటర్ ను ఆల్టర్నేట్ కోవిడ్ కేర్ సెంటర్ గా మారుస్తున్నటు అందులో ఉంది. ఈ ఫోటో కు సంబంధించి మరి కొన్ని ఆర్టికల్స్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించడం మనం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

అందుచేత, పైన రెండు ఫోటోలకు ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేదు. జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లోని కల్యాణ మండపాలను, సినిమా హాళ్ళను కోవిడ్ సెంటర్లుగా మార్చమని చెప్పినట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ దొరకలేదు. కానీ, కోవిడ్-19 కు సంబంధించి ప్రభుత్వం చేపట్టబోతున్న వివిధ చెర్యలను గురించి కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, అమెరికాలోని పాత కోవిడ్ సెంటర్ల ఫోటోలను పెట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll