Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పాత వీడియోలు పెట్టి, ‘కరోనా వైరస్ కారణంగా చైనాలో పందులను బ్రతికుండగానే పూడ్చిపెడుతున్నారు’ అని షేర్ చేస్తున్నారు.

0

చైనాలో కరోనా వైరస్ పందుల ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలుసుకుని దేశంలో ఉన్న పందులను పెద్ద గొయ్య తీసి సజీవంగా పుడుస్తున్న అక్కడ ప్రభుత్వం’ అని చెప్తూ కొన్ని వీడియోలను ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్: కొరోనా వైరస్ కారణంగా చైనాలో పందులను బ్రతికుండగానే పూడ్చిపెడుతున్న వీడియోలు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియోలకూ, కొరోనా వైరస్ కి అసలు సంబంధం లేదు. అవి పాత వీడియోలు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియో 1 (ఆర్కైవ్డ్):

వీడియోని ఒకరు యూట్యూబ్ లో మార్చి 2019 లోనే అప్లోడ్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ అనే వ్యాధి వచ్చినందున పందులను పూడ్చిపెడుతునట్టు వీడియో కింద వివరణలో ఉంటుంది. అంతేకాదు, నోవెల్ కొరోనా వైరస్ ని డిసెంబర్ 2019 చివరి వారంలో గుర్తించారు. కావున, ఆ వీడియోకీ, కొరోనా వైరస్ కు సంబంధం లేదు.

వీడియో 2 (ఆర్కైవ్డ్):

వీడియోని కూడా యూట్యూబ్ లో మార్చి 2019 లోనే అప్లోడ్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. యూట్యూబ్ వీడియోలో పై పోస్టులోని వీడియో (వీడియో 1) కూడా ఉన్నట్టు చూడవొచ్చు. కావున, ఈ వీడియో కూడా కోరనా వైరస్ కి సంబంధించిన వీడియో కాదు.

వీడియో 3 (ఆర్కైవ్డ్):

పోస్టులోని వీడియోని యూట్యూబ్ లో నవంబర్ 2019 లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. అయితే, ‘హాగ్ కలరా’ అనే వ్యాధి వచ్చినందున పందులను పూడ్చిపెడుతునట్టు వీడియో కింద వివరణలో ఉంటుంది. డిసెంబర్ 2019 చివరి వారంలో నోవెల్ కొరోనా వైరస్ ను గుర్తించారు కాబట్టి పోస్టులోని వీడియోకీ, కొరోనా వైరస్ కు సంబంధం లేదు.

పందులలో వచ్చే ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ మరియు ‘హాగ్ కలరా’ వ్యాధుల పై మరింత సమాచారం కోసం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ‘2019 నోవెల్ కొరోనా వైరస్’ మరియు ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ మధ్య తేడాల గురించి ఇక్కడ చదవొచ్చు.

చివరగా, పాత వీడియోలు పెట్టి, ‘కరోనా వైరస్ కారణంగా చైనాలో పందులను బ్రతికుండగానే పూడ్చిపెడుతున్నారు’ అని షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll