Fake News, Telugu
 

ఈ ఫోటోలోని గుడి కర్ణాటకలోని గుల్బర్గాలో ఉంది, ఇండోనేషియాలో కాదు

0

ఇండోనేషియా దేశంలో గరుడపక్షి ఆకారంలో వున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం అని చెప్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఇండోనేషియాలో గరుడపక్షి ఆకారంలో వున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం ఫోటో.

ఫ్యాక్ట్ (నిజం): ఈ గరుడపక్షి ఆకారంలో ఉన్న గుడి కర్ణాటకలోని గుల్బర్గాలో ఉంది, ఇండోనేషియాలో కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

పోస్టులో చిత్రాన్ని ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇదే చిత్రం కలిగిన ఒక ఫేస్ బుక్ పోస్ట్ లభించింది. ఆ పోస్ట్ వివరణలో ఇది ఇండోనేషియాలోని పెరుమాళ్ దేవాలయం అని ఉంది. కానీ కామెంట్స్ సెక్షన్‌లో కొందరు ఇది గుల్బర్గాలోని సర్వేశ్వర ఆలయం అని రాసారు.

దీన్ని ఆధారం చేసుకొని ఇంటర్నెట్ సెర్చ్ చెయ్యగా, వైరల్ పోస్టులో ఉన్న చిత్రం గుల్బర్గాలో సర్వేశ్వర ఆలయానిదే అని స్పష్టం అయ్యింది. గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న సర్వేశ్వర ఆలయం ఫోటో వైరల్ పోస్టులో ఉన్న ఫొటోతో సరిపోలుతుంది.

చివరిగా, ఇండోనేషియాలో గరుడపక్షి ఆకారంలో వున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం ఫోటో అని షేర్ చేస్తున్న గుడి కర్ణాటకలోని గుల్బర్గాలో ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll