Fake News, Telugu
 

ఈ చంద్రుడి ఫోటో కైలాస్ మానసరోవర్ దగ్గరలో తీసినది కాదు

0

కైలాస్ పర్వతం లోని మానసరోవర్ దగ్గర తీసిన చంద్రుడి ఫోటో, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కైలాస్ పర్వతం మానసరోవర్ దగ్గర తీసిన చంద్రుడి ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఈ ఫోటో గత కొన్నేళ్ళుగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నప్పటికీ, ఆ  ఫోటోకి సంబంధించి స్పష్టమైన సమాచారం ఎవ్వరు ఎక్కడ తెలుపలేదు. ఈ ఫోటో కైలాస్ మానసరోవర్ లో తీసినది అని చెప్పడానికి ఎలాంటి అధరాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ చాలా మంది యూసర్లు తమ ఫేస్బుక్ పేజిలో అలాగే, కొందరు తమ బ్లాగ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని ‘Reddit’ వెబ్సైటులో ‘29 ఆగష్టు 2019’ నాడు ఒక యూసర్ అప్లోడ్ చేసారు. ‘A Full Moon in Norway’ అనే టైటిల్ తో ఈ ఫోటోని ఆ యూసర్ ‘Reddit’ వెబ్సైటులో పోస్ట్ చేసారు. కాని, ఈ ఫోటో నార్వే దేశంలో తీసినది అని చెప్పటానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేదు.

ఈ ఫోటోని ‘flickr’ అనే అమెరికాకి చెందిన వెబ్సైటులో ‘6 November 2016’ నాడు అప్లోడ్ చేసారు. ‘A picture i Liked’ అనే కాప్షన్ తో ఈ ఫోటోని అప్లోడ్ చేసారు. ఇదే ఫోటోని షేర్ చేస్తూ పెట్టిన మరికొన్ని పోస్టులని ఇక్కడ చూడవచ్చు. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటో కైలాస్ మానసరోవర్ లో తీసినది అని ఎవ్వరు ఎక్కడ తెలుపలేదు.

చివరగా, ఈ ఫోటో కైలాస్ మానసరోవర్ దగ్గరలో తీసినది అని ఎలాంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll