Fake News, Telugu
 

ఫోటోలోని అమ్మాయి శబరిమల వెళ్లకుండా పోలీసువారు ఆపిన 12 ఏళ్ళ బాలిక కాదు

1

శబరిమల దర్శనానికి వెలుతున్న 12 ఏళ్ళ బాలికను కేరళ పోలీసువారు ఆపినట్టు చెప్తూ ఒక బాలిక ఫోటోని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: శబరిమల వెళ్లకుండా పోలీసు వారు ఆపిన 12 ఏళ్ళ బాలిక ఫోటో.    

ఫాక్ట్ (నిజం): 12 ఏళ్ళ బాలికను శబరిమల వెళ్లకుండా పోలీసువారు ఆపారు, కానీ ఫోటోలోని బాలిక తను కాదు. ఫోటోలోని బాలిక వయస్సు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. తనుకు 50 ఏళ్ళు వచ్చాక మళ్ళీ శబరిమల వస్తా అని ప్లకార్డు మెడలో వేసుకుంది. కావున, పోస్ట్ లో పోలీసు వారు ఆపిన 12 ఏళ్ళ బాలిక అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. 

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, శబరిమల దర్శనానికి వెళుతున్న 12 ఏళ్ళ బాలికను కేరళ పోలీసు వారు ఆపినట్టు ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారు ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ‘ఇండియా టుడే’ వారు ఈ సంఘటన కి సంబంధించి యూట్యూబ్ లో పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

కానీ, పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోలోని అమ్మాయికి కేవలం 9 సంవత్సరాలు అని, తనకి 50 ఏళ్ళు వచ్చాక మళ్ళీ శబరిమల దర్శనానికి వస్తా అని మెడలో ప్లకార్డు వేసుకున్నట్టు ‘ఆజ్ తక్’ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. కావున, పోస్టులో పెట్టిన ఫోటో పోలీసు వారు ఆపిన 12 ఏళ్ళ బాలికది కాదు.

చివరగా, 9 ఏళ్ళ బాలిక ఫోటో పెట్టి, శబరిమల వెళ్లకుండా పోలీసులు ఆపిన 12 ఏళ్ళ బాలిక ఫోటో అని ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll