Fake News, Telugu
 

షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయిబాబా హిందువు కాదని సుప్రీంకోర్టుకు తెలుపలేదు

0

సాయిబాబా హిందువు కాదని దేశంలోని 8 హైకోర్టులకు/ సుప్రీంకోర్టుకు తెలిపిన షిర్డీ సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్” అని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సాయిబాబా హిందువు కాదని సుప్రీంకోర్టుకు తెలిపిన షిర్డీ సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్.

ఫాక్ట్: సాయిబాబా హిందువు కాదని సుప్రీంకోర్టుకు షిర్డీ సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ తెలిపినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అసలు ‘షిర్డీ సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్’ అనే పేరుతో మాకు ఎటువంటి ట్రస్ట్ దొరకలేదు షిర్డీలోని ట్రస్ట్ పేరు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్. సాయిబాబా జీవితచరిత్ర ‘శ్రీ సాయి సత్చరిత’ రాసిన గోవింద్ రఘునాథ్ దాభోల్కర్ యొక్క పుస్తకంలో సాయిబాబా ఏ మతానికి చెందినవారో కచ్చితంగా చెప్పలేమని ఉంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, సాయిబాబా హిందువు కాదని అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగుంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

అసలు ‘షిర్డీ సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్’ అనే పేరుతో మాకు ఎటువంటి ట్రస్ట్ దొరకలేదు. షిర్డీలోని ‘శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్’ శ్రీ సాయిబాబా సమాధి ఆలయాన్ని మరియు ఆ ఆవరణలోని ఇతర దేవాలయాలను చూసుకుంటుంది; ‘షిర్డీ సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్’ కాదు.

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ వారి అధికారిక ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్స్‌లో ఎక్కడా కూడా సాయిబాబా హిందువు కాదని అనలేదు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ వెబ్సైటులో కూడా సాయిబాబా హిందువు కాదని లేదు.

సాయిబాబా జీవితచరిత్ర ‘శ్రీ సాయి సత్చరిత’ రాసిన గోవింద్ రఘునాథ్ దాభోల్కర్ యొక్క పుస్తకంలోసాయిబాబా తల్లిదండ్రులు, జననం, మరియు జన్మస్థలం ఎవరికీ తెలియదు. అనేక విచారణలు జరిగాయి, ఈ అంశాలకు సంబంధించి బాబా మరియు ఇతరులకు అనేక ప్రశ్నలు వేయబడ్డాయి, కానీ సంతృప్తికరమైన సమాధానం, సమాచారం ఇంకా దొరకలేదు. ఈ విషయాల గురించి మనకు ఏమీ తెలియదు.” కానీ, సాయిబాబా షిర్డీలో ఉన్న దాని ప్రకారం, 1838లో పుట్టారని అంచనా వేయొచ్చని తెలిపారు.  

సాయిబాబాను “అవమానించి, కించపరిచే” వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, కందివలికి చెందిన సాయి ధామ్ ఆలయం యొక్క ట్రస్ట్ బొంబాయి హైకోర్టును 2014లో ఆశ్రయించింది. సాయిబాబా ముస్లిం కాదని, బ్రాహ్మణుడని పెటిషన్ లో పేర్కొంది.

చివరగా, షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయిబాబా హిందువు కాదని సుప్రీంకోర్టుకు తెలిపినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll