Fake News, Telugu
 

వీడియోలో కనిపిస్తున్న ఈ పాకిస్తాన్ వ్యక్తి పెళ్లి చేసుకున్నది తన స్టూడెంట్‌ని, కూతురుని కాదు

0

ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురునే నాలుగో పెళ్లి చేసుకున్నాడని చెప్తూ ఒక ముస్లిం జంట తమ వివాహం గురించి మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం వ్యక్తి తన సొంత కూతురునే నాలుగో పెళ్లి చేసుకున్నానని చెప్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): వీడియోలోని వ్యక్తి ఆ మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆమె తన కూతురు కాదు. వీరు పాకిస్తాన్‌లోని లాహోర్‌కి చెందిన వారు, వీడియోలోని మహిళ తన స్టూడెంట్, వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇవే విషయాలు వీరు అనేక ఇంటర్వ్యూలలో స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ విలేకరి ఈ దంపతులతో మాట్లాడుతూ, ‘అరబిక్‌లో రబియా అంటే ‘నాలుగు’ అని అర్ధం కాబట్టి, ఆయనకి నాల్గవ భార్య కావడం యాదృచ్చికమేనానని ఆమె ప్రశ్నిచింది. దీనికి ఆమె జవాబు ఇస్తూ రబియా అంటే నాల్గవ కుమార్తె అని నేను విన్నాను. కాని నేను నాల్గవ కూతుర్ని కాను, రెండో కూతుర్ని. ఐతే నా పేరుకు అర్ధం నాలుగు అయితే, నేను నాలుగోదానితో సరిపోతాను, నాలుగో భార్యను అవుతాను, అంటూ వ్యంగ్యంగా చెప్పింది.’

ఐతే బహుశా ఈ సంభాషణలను తప్పుగా అర్ధం చేసుకొని, ఆ మహిళ ఆ వ్యక్తి కూతురని, ఆమెని తను పెళ్లి చేసుకున్నాడని అనుకొని ఉండవచ్చు.

వీడియోలోని మహిళను ఆ వ్యక్తి నాలుగో పెళ్లి చేసుకున్న మాట నిజమే అయినప్పటికీ, ఆ మహిళ తన కూతురు కాదు. పైగా అతను ఇంతకు ముందు ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన తరవాతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు అమీర్ ఖాన్ కాగా, అతని వయసు 50 సంవత్సరాలు. కాగా తన భార్య రబియా వయసు 30 సంవత్సరాలు. వీరు పాకిస్తాన్‌లోని లాహోర్‌కి చెందిన వారు.

గతం కూడా వీరి వివాహానికి సంబంధిచిన వార్తలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఈ జంట మీడియాతో మాట్లాడుతూ వీరి వివాహానికి సంబంధించి పుకార్లను ఖండించారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆమె తన స్టూడెంట్ అని, తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలిపాడు. అలాగే తనకు ఇంతకు ముందు జరిగిన మూడు పెళ్ళిళ్ళలో విడాకులు జరిగాయని స్పష్టం చేసాడు. దీన్నిబట్టి సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నట్టు వీడియోలోని వ్యక్తులు తండ్రి కూతుర్లు కారని స్పష్టమవుతుంది.

చివరగా, వీడియోలో కనిపిస్తున్నఈ పాకిస్తాన్ వ్యక్తి పెళ్లి చేసుకున్నది తన స్టూడెంట్‌ని, కూతురుని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll